చిట్టియ్యపాలెంలో యువకుడికి పాముకాటు | - | Sakshi
Sakshi News home page

చిట్టియ్యపాలెంలో యువకుడికి పాముకాటు

Jun 5 2026 12:12 AM | Updated on Jun 5 2026 12:12 AM

బుచ్చెయ్యపేట : మండలంలో గల చిట్టియ్యపాలెం గ్రామంలో ఓ యువకుడు పాము కాటుకు గురయ్యాడు. గురువారం ఉదయం గ్రామానికి చెందిన ముచ్చకర్ల గణేష్‌ గ్రామంలో జగనన్న కాలనీలో నిర్మాణంలో ఉన్న తన ఇంటికి వెళ్లాడు. ఇంట్లో పని చేస్తుండగా గణేష్‌ను పాము కాటు వేసింది. దీంతో కుటుంబ సభ్యులు దగ్గరలో ఉన్న తురకలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఉదయం 7 గంటల సమయంలో వైద్యాధికార్లు లేకపోవడంతో గణేష్‌ను అనకాపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గణేష్‌ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఇటీవల 15 రోజుల కిందట చినమదీనకు చెందిన 30 ఏళ్ల యువకుడు నాగరాజును పాము కాటు వేయగా ఆయన్ని ప్రైవేటు వైద్యుని దగ్గరకు తీసుకెళ్లగా సకాలంలో వైద్య సేవలు అందక మృతి చెందాడు.

Advertisement
 
Advertisement
Advertisement