రాష్ట్రంలో తుగ్లక్‌ పాలన | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో తుగ్లక్‌ పాలన

Jun 5 2026 12:06 AM | Updated on Jun 5 2026 12:06 AM

అరకులోయ టౌన్‌ (పాడేరు రూరల్‌): రాష్ట్రంలో తుగ్లక్‌ పాలన సాగుతోందని అరకు ఎమ్మెల్యే రేగం మత్య్సలింగం తెలిపారు. నియోజకవర్గ కేంద్రం అరకులోయలో ఎమ్మెల్యే రేగం ఆధ్వర్యంలో గురువారం చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. నాలుగు రోడ్ల జంక్షన్‌ వద్ద రాస్తారోకో నిర్వహించి మేనిఫెస్టో పత్రాలను కాల్చి నిరసన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నిరంకుశ పాలనను అందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల హమీలను అమలు చేయడంలో చేతకాని ప్రభుత్వం రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని మాత్రం సమర్థవంతంగా నిర్వహిస్తోందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్నా సూపర్‌ సిక్స్‌ అమలులో పూర్తి విఫలమైందన్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత మొదలైందన్నారు. భవిష్యత్తులో కూటమి ప్రభుత్వానికి మనుగడ లేకుండా పోతుందన్నారు. ఇప్పటికై నా ప్రజలకు ఇచ్చిన హమీలు అమలు చేసి చిత్తశుద్ధి చాటుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు రేగం చాణక్య, ఎస్టీసెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, ఎస్టీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు, మండల పార్టీ అధ్యక్షులు రామ్మూర్తి, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు నర్సింగరావు, అరకు నియోజకవర్గ బూత్‌ కమిటీ ఇన్‌చార్జి పాంగి విజయ్‌కుమార్‌, ఎంపీటీసీ సభ్యుడు డి.ఆనంద్‌కుమార్‌, పార్టీ సీనియర్‌ నాయకులు కమిడి అశోక్‌, ప్రకాష్‌, జగన్‌కుమార్‌, ఎల్‌బీ కిరణ్‌కుమార్‌, శివ, సోమేశ్వరి పాల్గొన్నారు.

మేనిఫెస్టో ప్రతులను తగులబెడుతున్న ఎమ్మెల్యే మత్స్యలింగం, పార్టీ శ్రేణులు

అరకులో ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆధ్వర్యంలో రాస్తారోకో

అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం విమర్శ

Advertisement
 
Advertisement
Advertisement