● కలెక్టర్ నిశాంతి ఆదేశం
సాక్షి,పాడేరు: అంగన్‌వాడీ కేంద్రాల్లో కిచెన్ గార్డెన్‌ల ద్వారా సేంద్రియ విధానంలో ఆకుకూరలు,కూరగాయలు సాగు చేసి చిన్నారులకు స్వచ్ఛమైన ఆహారం వండిపెట్టాలని కలెక్టర్ టి.నిశాంతి ఆదేశించారు. గురువారం డోకులూరు అంగన్‌వాడీ కేంద్రంలో కిచెన్‌గార్డెన్‌ను ఆమె ప్రారంభించారు. కూరగాయలు, ఆకుకూరల విత్తనాలను ఆమె జల్లారు. చిన్నారుల యోగక్షేమాలను తెలుసుకున్నారు. ఐసీడీఎస్ పీడీ ఝాన్సీరామ్‌పడాల్, సీడీపీవో శారద, సూపర్‌వైజర్లు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.


