విత్తన బంతులతో పచ్చదనం
గిరిజనుడు నిర్మిస్తున్న ఇంటివద్ద అధికారులు ఏర్పాటుచేసిన హెచ్చరిక బోర్డును చూపిస్తున్న కిల్లో సురేంద్ర, గిరిజన సంఘ నేతలు
హుకుంపేట (డుంబ్రిగుడ): హుకుంపేట మండల కేంద్రంలో సర్వహక్కులు కలిగిన గిరిజనుడు కంబ శ్రీను స్వయం ఉపాధి కోసం నిర్మించుకుంటున్న కట్టడాన్ని అక్రమమంటూ రెవెన్యూ అధికారులు నిలిపివేయడం, అక్కడ హెచ్చరిక బోర్డు పెట్టడంపై ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర తీవ్రంగా మండిపడ్డారు. గిరిజన సంఘం మండల కార్యదర్శి టి.కృష్ణారావు, నాయకుడు వి.లక్ష్మణరావుతో కలిసి ఆయన మంగళవారం వివాదాస్పద స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కిల్లో సురేంద్ర విలేకరులతో మాట్లాడుతూ.. గిరిజనుడు ఇల్లు కట్టుకుంటే చట్టవిరుద్ధమా?.. గిరిజనేతరులు కడితే చట్టబద్ధమా? అని అధికారులను నిలదీశారు. స్థానిక అధికారుల అలసత్వం వల్ల ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులు విపరీతంగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇది ముమ్మాటికి 1/70 చట్టాన్ని ఉల్లంఘించడమేనన్నారు. గిరిజనేతరులైన షేక్ వహీద్, లంకా శ్రీను, భాస్కర్, కాకినాడ విజయ, మోదమాంబ తదితరులు చేపడుతున్న నిర్మాణాలను ఎందుకు అడ్డుకోలేదో అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తక్షణమే గిరిజనేతరుల అక్రమ ఆక్రమణలపై విచారణ జరిపి, వారిపై ఎల్టీఆర్ కేసులు నమోదు చేయాలని, గిరిజనుడి నిర్మాణానికి సహకరించాలని వారు కోరారు.


