అధినేతను కలిసిన అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం | - | Sakshi
Sakshi News home page

అధినేతను కలిసిన అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం

Jun 3 2026 12:33 AM | Updated on Jun 3 2026 12:33 AM

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

అప్పన్నకు ఆర్జిత సేవలు

సింహాచలం: శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామికి మంగళవారం ఆర్జిత సేవలు వైభవంగా జరిగాయి. ఉదయం 9.30 గంటల నుంచి నిత్య కల్యాణం శాస్త్రోక్తంగా జరిపారు. ఆలయ కల్యాణ మండపంలో స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను అధిష్టింపజేశారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్ర బెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణం కమనీయంగా సాగింది.

పీజీ సెట్‌లో మర్రిపాలెం విద్యార్థినుల ప్రతిభ

కొయ్యూరు: ఇటీవల ప్రకటించిన పీజీసెట్‌ ఫలితాల్లో మర్రిపాలెం మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులు మంచి ర్యాంకులను సాధించారని ప్రిన్సిపాల్‌ కె.సుధ మంగళవారం తెలిపారు. ఆంగ్ల విభాగంలో బత్తుల చోదన 200, గణితంలో మాసాడ లావణ్య 267, మువ్వల మాధవి 504, కిలో మైత్రి 537, అర్ధశాస్త్రంలో దోని చింతల్లి 270 ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement