పట్టాలెక్కిన జోన్‌ ఆకాంక్ష | - | Sakshi
Sakshi News home page

పట్టాలెక్కిన జోన్‌ ఆకాంక్ష

Jun 2 2026 3:18 AM | Updated on Jun 2 2026 3:18 AM

వేసవి సెలవుల్లో అడ్మిషన్లు

కొయ్యూరు: వేసవి సెలవులు పూర్తి కాకుండానే ఐదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులను ఆరో తరగతిలో చేర్చాలని ఆదేశాలు రావడంతో ఆ మేరకు ఎంఈవోలు చర్యలు తీసుకుంటున్నారు. ఏకలవ్యతో పాటు మరికొన్ని పాఠశాలల్లో సెలవుల్లో ఆడ్మిషన్లు నిర్వహిస్తున్నారు. గతంలో వేసవి సెలవులకు ముందే ఉపాధ్యాయులు..పై తరగతులకు వెళ్లే విద్యార్థుల జాబితా తయారు చేసేవారు. ప్రాథమిక పాఠశాలల్లో ఐదో తరగతి పూర్తి చేసిన వారిని సెలువుల అనంతరం ఆరో తరగతిలో ఆడ్మిట్‌ చేసేవారు. ఇప్పుడు సెలవుల్లోనే అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఉపాధ్యాయులు కచ్చితంగా పాఠశాలలకు వెళ్లి ఆరోతరగతిలో జాయిన్‌ అయ్యే వారికి రికార్డ్‌షీట్‌లను ఇవ్వాల్సి ఉంటుంది. విద్యార్థులను ఆరో తరగతిలో జాయిన్‌ చేసుకోడానికి ఉన్నత పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు కూడా అందుబాటులో ఉండాలి. ఈ మేరకు సమాచారం ఇస్తున్నట్టు ఎంఈవో సింహాచలం తెలిపారు. అందుబాటులో ఉన్న ఉపాధ్యాయులను రప్పించి ఆ పత్రాలను జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు

సాక్షి, విశాఖపట్నం: భారతీయ రైల్వే వ్యవస్థలో 18వ జోన్‌గా విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ కార్యకలాపాలు సోమవారం లాంఛనంగా ప్రారంభమయ్యాయి. వీఎంఆర్‌డీఏ డెక్‌ భవనంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక కార్యాలయంలో జోన్‌ జనరల్‌ మేనేజర్‌ సందీప్‌ మాథుర్‌ కార్యకలాపాలను నిరాడంబరంగా ప్రారంభించారు. రైల్వే శాఖ రూపొందించిన జోన్‌ అధికారిక మ్యాప్‌(సిస్టమ్‌ మ్యాప్‌)ని విడుదల చేశారు. దేశ రవాణా వ్యవస్థలో అత్యంత కీలకమైన నెట్‌వర్క్‌గా రూపుదిద్దుకున్న ఈ జోన్‌.. ఏకంగా నాలుగు రాష్ట్రాల పరిధిలో విస్తరించి తన భౌగోళిక, వ్యూహాత్మక ప్రాధాన్యతను చాటుకుంది. మొత్తం 3,532 కిలోమీటర్ల సువిశాల విస్తీర్ణం(రూట్‌ నెట్‌వర్క్‌), 6,455 కిలోమీటర్ల భారీ రైల్వే ట్రాక్‌లైన్‌తో దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక జోన్‌లలో ఒకటిగా అవతరించింది. పూర్తి స్థాయి జోనల్‌ కార్యకలాపాలు మొదలయ్యేసరికి మరో నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉందని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.

భద్రతకే ప్రథమ ప్రాధాన్యం : అనంతరం జీఎం ప్రిన్సిపల్‌ హెడ్‌ ఆఫ్‌ డిపార్ట్‌మెంట్స్‌, నాలుగు డివిజన్ల డీఆర్‌ఎంలతో కలిసి మొట్టమొదటి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయా డివిజన్ల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పన, భవిష్యత్తు కార్యాచరణపై అధికారులతో జీఎం సుదీర్ఘంగా చర్చించారు. కొత్త జోన్‌లో విలీనమవుతున్న తమ డివిజన్ల గురించి ఆయా డీఆర్‌ఎంలు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఆస్తుల నిర్వహణ, మానవ వనరుల నిర్వహణ, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లు, వాటి పరిష్కార మార్గాలపై సమావేశంలో కూలంకషంగా చర్చించారు. ఈ సమీక్షలో విశాఖపట్నం డీఆర్‌ఎం లలిత్‌ బోహ్రా, విజయవాడ డీఆర్‌ఎం మోహిత్‌ సోనాకియా, గుంటూరు డీఆర్‌ఎం సుదేష్ణసేన్‌, గుంతకల్లు డీఆర్‌ఎం చంద్రశేఖర్‌ గుప్తాతో పాటు వివిధ శాఖల హెచ్‌వోడీలు, అధికారులు పాల్గొన్నారు.

హెచ్‌పీసీఎల్‌

ఈడీగా అభిషేక్‌ త్రివేది

మల్కాపురం(విశాఖ): హిందుస్థాన్‌ పెట్రోలి యం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ విశాఖ రిఫైనరీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అభిషేక్‌ త్రివేది సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఈడీగా పనిచేసిన రమేష్‌ కృష్ణన్‌ పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో అభిషేక్‌ త్రివేది నియమితులయ్యారు. అభిషేక్‌ త్రివేదికి చమురు, సహజవాయువు రంగంలో విశేష అనుభవం ఉంది. సంస్థ కు చెందిన పలువురు ఉన్నతాధికారులు ఆయన కు శుభాకాంక్షలు తెలిపారు.

ఈఎస్‌ఐసీ మెడికల్‌ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

సీతంపేట(విశాఖ): ఈఎస్‌ఐసీ మెడికల్‌ కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి ఇన్సూర్డ్‌ పర్సన్స్‌ (ఐపీఎస్‌) పిల్లలకు ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీఎస్సీ నర్సింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జాయింట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ ఎం.రామారావు ఓ ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన కార్మికుల పిల్లలు నీట్‌ (యూజీ)–2026 పరీక్షకు హాజరై, ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరని ఆయన పేర్కొన్నారు. అర్హత సాధించిన అభ్యర్థులు ఈఎస్‌ఐసీ ద్వారా జారీ చేసే ‘వార్డ్‌ ఆఫ్‌ ఇన్సూర్డ్‌ పర్సన్‌’ సర్టిఫికేట్‌ను కచ్చితంగా పొందాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 20 ఈఎస్‌ఐసీ మెడికల్‌ కళాశాలల్లో మొత్తం 695 ఎంబీబీఎస్‌ సీట్లు, 28 బీడీఎస్‌ సీట్లు, 60 బీఎస్సీ నర్సింగ్‌ సీట్లను ఐపీఎస్‌ పిల్లల కోసం కేటాయించినట్లు వివరించారు. అర్హులైన అభ్యర్థులు ఐపీ సర్టిఫికెట్‌ కోసం ఈఎస్‌ఐసీ అధికారిక వెబ్‌సైట్‌ www.esic.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సర్టిఫికేట్‌ పొందిన విద్యార్థులు డీజీహెచ్‌ఎస్‌ లేదా ఎంసీసీ వెబ్‌సైట్‌ ఠీఠీఠీ. ఝఛిఛి. ుఽజీఛి. జీుఽ ద్వారా నిర్వహించే ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు. అయితే, 2025, సెప్టెంబర్‌ 30 నాటికి ఈఎస్‌ఐసీ సభ్యత్వం కలిగి ఉన్న కార్మికుల పిల్లలకు మాత్రమే ఈ ప్రవేశాలు వర్తిస్తాయని స్పష్టం చేశారు.

జోన్‌కు సంబంధించిన వివరాలిలా..రాష్ట్రాల వారీగా రూట్‌/ రన్నింగ్‌ ట్రాక్‌ వివరాలివీ రాష్ట్రం రూట్‌ (కిమీ.లో) రన్నింగ్‌ ట్రాక్‌ (కిమీ.లో)

ఆంధ్రప్రదేశ్‌ 3453.007 6278.686

కర్ణాటక 47.030 94.060

తెలంగాణ 25.510 75.830

తమిళనాడు 6.860 6.860

మొత్తం 3532.407 6455.436

డివిజన్ల వారీగా రూట్‌/రన్నింగ్‌ ట్రాక్‌ వివరాలివీ

డివిజన్‌ రూట్‌ (కిమీ.లో) రన్నింగ్‌ ట్రాక్‌ (కిమీ.లో)

విశాఖపట్నం 460.767 979.546

విజయవాడ 1111.114 2409.051

గుంటూరు 613.711 883.504

గుంతకల్లు 1346.815 2183.335

మొత్తం 3532.407 6455.436

నిరాడంబరంగా ప్రారంభించిన

జోన్‌ జీఎం సందీప్‌ మాథుర్‌

జోన్‌ అధికారిక మ్యాప్‌ విడుదల

3,532 కిమీ విస్తీర్ణం..

6,455 కిమీ రైల్వే లైన్‌

నాలుగు రాష్ట్రాల పరిధిలో విస్తరించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌

చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది :

జీఎం సందీప్‌ మాథుర్‌

Advertisement
 
Advertisement
Advertisement