ఏపీపీటీఏ రాష్ట్ర అసోసియేట్‌ ప్రెసిడెంట్‌గా శ్రీనివాస్‌ | - | Sakshi
Sakshi News home page

ఏపీపీటీఏ రాష్ట్ర అసోసియేట్‌ ప్రెసిడెంట్‌గా శ్రీనివాస్‌

Jun 1 2026 12:38 AM | Updated on Jun 1 2026 12:38 AM

కశింకోట: ఆంధ్రప్రదేశ్‌ ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం (ఏపీపీటీఏ) రాష్ట్ర అసోసియేట్‌ ప్రెసిడెంట్‌గా కశింకోటకు చెందిన కొత్తపల్లి శ్రీనివాస్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండేళ్ల పదవీ కాలానికి గాను సంఘం ఎన్నికలు విజయవాడలో జరిగాయి. తనపై నమ్మకంతో ఉన్నత బాధ్యతను అప్పగించినందుకు ఆయన కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయుల సంక్షేమం, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం మరింత శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు.జిల్లా సంఘంలో పలు పదవులు నిర్వహిస్తూ ఉపాధ్యాయుల హక్కుల సాధన, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాస్‌కు తాజాగా ఉన్నత పదవి లభించడం పట్ల ఏపీపీటీఏ అనకాపల్లి జిల్లా శాఖ అధ్యక్షుడు బోయిన చిన్నారావు, ప్రధాన కార్యదర్శి చల్లా నాగేశ్వరావు తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement