అప్పన్నకు వైభవంగా ఆర్జిత సేవలు | - | Sakshi
Sakshi News home page

అప్పన్నకు వైభవంగా ఆర్జిత సేవలు

Jun 1 2026 12:38 AM | Updated on Jun 1 2026 12:38 AM

సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఆదివారం ఆర్జిత సేవలు వైభవంగా జరిగాయి. ఉదయం 9.30 నుంచి నిత్యకల్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ కల్యాణమండపంలో స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేశారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉభయ దాతలకు కల్యాణ అక్షింతలు, ప్రసాదం, శేషవస్త్రంలను అందించారు.

ఘనంగా గరుడసేవ : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి గరుడసేవ ఘనంగా జరిగింది. ఆలయ కల్యాణమండపంలో వెండి గరుడవాహనంపై స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని వేంజేపచేశారు. అష్టోత్తర శతనామావళి పూజ శాస్త్రోక్తంగా జరిపారు. విశేష హారతులు అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement