కశింకోటలో పోలీసులు స్వాధీనం చేసుకున్న ట్రాక్టర్లు
కశింకోట: మట్టిని అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకుని మైన్స్ శాఖకు అప్పగించినట్లు సీఐ అల్లు స్వామి నాయుడు ఆదివారం తెలిపారు. కశింకోట పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో మట్టిని అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను గుర్తించామని చెప్పారు.వాటిని స్వాధీనం చేసుకుని మైన్స్ శాఖ అధికారులకు అప్పగించామన్నారు. ఆ శాఖ అధికారులు ట్రాక్టర్‌కు రూ.8 వేల చొప్పున జరిమానా విధించారని సీఐ తెలిపారు.


