డీటీ సత్యనారాయణకు అరుదైన గౌరవం | - | Sakshi
Sakshi News home page

డీటీ సత్యనారాయణకు అరుదైన గౌరవం

May 31 2026 12:48 AM | Updated on May 31 2026 12:48 AM

గూడెంకొత్తవీధి: మండల రెవెన్యూ కార్యాలయంలో సర్వే విభాగం డిప్యూటీ తహసీల్దారుగా పనిచేస్తున్న దుమంతి సత్యనారాయణకు అరుదైన గౌరవం దక్కింది. శనివారం విశాఖపట్నంలోని ట్రైబల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ మిషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ) డాక్టర్‌ రాణి మంథా ఆయనను ఘనంగా సత్కరించారు. గిరిజన ప్రభుత్వ ఉద్యోగిగా విధి నిర్వహణలోనే కాకుండా, సమాజంపై బాధ్యతతో నిరంతరం పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నందుకు గాను సత్యనారాయణ సేవలను గుర్తించి ఈ పురస్కారాన్ని అందజేశారు. కాగా, సామాజిక సేవలో విశేష గుర్తింపు తెచ్చుకున్న సత్యనారాయణ ఇప్పటివరకు వివిధ రంగాలలో నాలుగు రాష్ట్ర స్థాయి అవార్డులను అందుకోవడం విశేషం. ఆయనకు ఈ అరుదైన గౌరవం దక్కడంపై మండల రెవెన్యూ సిబ్బంది, పలువురు గిరిజన నేతలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

సామాజిక సేవలో

విశేష సేవలకు సత్కారం

Advertisement
 
Advertisement
Advertisement