విశ్రాంత జీవితం ప్రశాంతంగా సాగాలి | - | Sakshi
Sakshi News home page

విశ్రాంత జీవితం ప్రశాంతంగా సాగాలి

May 31 2026 12:48 AM | Updated on May 31 2026 12:48 AM

● ఎస్పీ తుహిన్‌ సిన్హా

పదవీ విరమణ పొందిన పోలీస్‌ సిబ్బందిని సత్కరించిన ఎస్పీ తుహిన్‌ సిన్హా

అనకాపల్లి: విశ్రాంత జీవితం కుటుంబ సభ్యులతో కలిసి ఆరోగ్యంగా, ప్రశాంతంగా సాగాలని ఎస్పీ తుహిన్‌ సిన్హా ఆకాంక్షించారు. వివిధ పోలీస్‌ స్టేషన్లో సుదీర్ఘకాలం పనిచేసి పదవీ విరమణ పొందిన అనకాపల్లి టౌన్‌ ఏఎస్‌ఐ బి.రామ్‌కుమార్‌, పరవాడ ఏఎస్‌ఐ వి.త్రినాథ్‌రావు, ఏఆర్‌ హెచ్‌సీ ఎల్‌.గోవిందరావులను శనివారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఆయన శాలువాలతో సత్కరించారు. ఉమ్మడి జి ల్లాలో వీరు అందించిన సేవలు శాఖకు గర్వకారణమన్నారు. ఏఎస్పీ ఎల్‌.మోహనరావు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement