చోడవరం: అత్త మృతికి కారకురాలైన కోడల్ని అరెస్టు చేసినట్టు అనకాపల్లి డీఎస్పీ శ్రావణి తెలిపారు. స్థానిక పోలీసు స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసుకు సంబంఽధించిన వివరాలను ఆమె వెల్లడించారు. పసలమ్మ, కొడుకు లక్ష్మణావు, కోడలు నాగమణి, మనవడుతో కలిసి మండలంలోని వెంకన్నపాలెంలో ఒకే ఇంట్లో ఉంటున్నారు. తరుచూ అత్త పసలమ్మ, కోడలు నాగమణి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఎప్పటిలాగే గురువారం కూడా ఇద్దరు మధ్య వివాదం తలెత్తింది. ఆ సమయంలో ఆవేశంతో కోడలు నాగమణి కర్రతో అత్త తలపై కొట్టి తీవ్రంగా గాయపరిచింది. గాయపడిన పసలమ్మను అనకాపల్లి ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్టు డీఎస్పీ చెప్పారు. కొడుకు లక్ష్మణరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితురాలైన నాగమణిని అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్టుతెలిపారు. కోర్టు రిమాండ్ విధించినట్టు డీఎస్పీ చెప్పారు. ఈ సమావేశంలో చోడవరం సీఐ అప్పలరాజు, ఎస్‌ఐ కార్తికేయ పాల్గొన్నారు.
డీఎస్పీ శ్రావణి


