పోలీసు సిబ్బంది సమస్యలు పరిష్కరిస్తాం | - | Sakshi
Sakshi News home page

పోలీసు సిబ్బంది సమస్యలు పరిష్కరిస్తాం

May 30 2026 12:17 AM | Updated on May 30 2026 12:17 AM

ఏఎస్పీ మోహన్‌రావు

పోలీస్‌ సిబ్బంది సమస్యలను ఫోన్లో

తెలుసుకుంటున్న ఏఎస్పీ మోహన్‌రావు

అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ–సంపార్కు(ఫోన్‌ల్లో సమస్యలు చెప్పడం) కార్యక్రమం జరిగింది. జిల్లాలో వివిధ పోలీస్‌ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డులు, కానిస్టేబుళ్లు, హెచ్‌సీలు వారివారి వ్యక్తిగత, వృత్తిపరమైన సమస్యలను ఫోన్లో ఏఎస్పీ ఎల్‌.మోహన్‌రావుకు విన్నవించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ ఫోన్‌ ద్వారా 11 మంది పోలీస్‌ సిబ్బంది వారి సమస్యలను తెలియజేశారన్నారు. వారం రోజుల్లో వాటి పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు. ప్రతి శుక్రవారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకూ 93469 12011 నంబరుకు పోలీస్‌ సిబ్బంది సమస్యలు తెలియజేయవచ్చన్నారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి ఎస్పీ కార్యాలయానికి వచ్చి వివరించడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అందువల్ల ఫోన్‌ ద్వారా పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో కార్యాలయం ఏవో సిహెచ్‌.తిలక్‌ బాబు, ఆఫీస్‌ సూపరింటెండెంట్‌ ప్రతాప్‌ శేషయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement