హెల్మెట్‌ ధరించి ప్రాణాలు కాపాడుకోండి | - | Sakshi
Sakshi News home page

హెల్మెట్‌ ధరించి ప్రాణాలు కాపాడుకోండి

May 29 2026 2:07 AM | Updated on May 29 2026 2:07 AM

ఎస్పీ అమిత్‌ బర్దర్‌

సాక్షి,పాడేరు: జిల్లాలోని ప్రతి ఒక్కరు బైక్‌ నడిపేటప్పుడు హెల్మెట్‌ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని ఎస్పీ అమిత్‌బర్దర్‌ పిలుపునిచ్చారు. గురువారం పాతబస్టాండ్‌ అంబేడ్కర్‌ సెంటర్‌ వద్ద హెల్మెట్‌ వినియోగంపై ప్రజలకు ఎస్పీ అవగాహన కల్పించారు. అనంతరం హెల్మెట్‌ వినియోగంపై ప్రజలను చైతన్యపరుస్తూ బైక్‌ ర్యాలీని ప్రారంభించారు. హెల్మెట్‌ ధరించి బైక్‌ నడిపారు. జూనియర్‌ కళాశాల వరకు బైక్‌ ర్యాలీ ఉత్సాహంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్మెట్‌ ధరించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. బైక్‌లు నడిపే సమయంలో ప్రతి ఒక్కరు హెల్మెట్‌ ధరించాలని, తమపై అధారపడి ఉన్న కుటుంబ సభ్యు లను గుర్తు చేసుకుని బాధ్యతగా వ్యవహరించాలన్నారు. హెల్మెట్‌ ధరించకుండా వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు,కేసులు నమోదు,జరిమానాలు విధిస్తామని ఎస్పీ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీఐ దీనబంధు, ఎస్‌ఐలు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement