గాజువాక: పాతగాజువాక చిట్టినాయుడు కాలనీకి చెందిన చీర అప్పలనాయుడు (65) గురువారం బస్టాప్ వద్ద సొమ్మసిల్లి పడిపోయి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చిట్టినాయుడు కాలనీలో జరిగిన ఓ అంత్యక్రియలకు వెళ్లిన ఆయన తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అనంతరం పాతగాజువాక బస్టాప్ వద్ద అపస్మారక స్థితిలో ఉన్నట్లు సమాచారం అందింది.వెంటనే అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సిబ్బంది పరిశీలనలో వడదెబ్బ కారణంగా మృతి జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు గాజువాక పోలీసులకు సమాచారం అందించగా, అధికారులు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. అదేవిధంగా అదే ప్రాంతానికి చెందిన ఉరుకూటి పైడికొండ (56) డ్వాక్రా సమావేశానికి వెళ్లి తిరిగి ఆటోలో వస్తుండగా మార్గమధ్యలో సొమ్మసిల్లి పడిపోయారు. ఆమె కూడా ఎండ తీవ్రత కారణంగా మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు.
చీర అప్పలనాయుడు (ఫైల్)
ఉరుకూటిపైడికొండ (ఫైల్)


