కొత్తపల్లికి పర్యాటకుల తాకిడి
జి.మాడుగుల: మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం కొత్తపల్లి జలపాతానికి శనివారం పలు ప్రాంతాల నుండి పర్యాటకులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగున ఉన్న ఒడిశా నుంచి ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చారు. జలపాతంలో స్నానాలు చేస్తూ సందడి చేశారు. ప్యూపాయింట్ వద్ద సెల్ఫీలు, ఫోటోలు దిగారు. సందర్శకుల ప్రవేశ రుసం ద్వారా శుక్రవారం రూ.84,120, శనివారం రూ.70,720 ఆదాయం వచ్చిందని సిబ్బంది తెలిపారు.
క్యూ కడుతున్న పర్యాటకులు
సీలేరు: ఈ ప్రాంతంలోని పర్యాటక అందాలను తిలకించేందుకు నాలుగు రోజులుగా పర్యాటకులు క్యూ కడుతున్నారు. సప్పర్ల రెయిన్‌గేజ్, ధారాలమ్మ తల్లి ఆలయం, సీలేరులోని గుంటవాడ జలాశయ సందర్శనకు తరలివస్తన్నారు. ప్రత్యేక వాహనాల్లో రావడంతో రహదారులు రద్దీగా మారాయి.
కొత్తపల్లికి పర్యాటకుల తాకిడి


