పారిశుధ్యం పడకేసింది
9లో
ఉత్సాహంగా పోటీలు
గూడెంకొత్తవీధి: మండలంలోని దేవరాపల్లిలో సర్పంచ్ సిరిబాల బుజ్జిబాబు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. మూడు రోజులపాటు మహిళలకు ముగ్గుల పోటీలు, కుర్చీలాట, పురుషులకు విలువిద్య, క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, పిల్లలకు డ్యాన్స్, ఆటలు, పాటల పోటీలను నిర్వహించారు.విజేతలకు శనివారం బహుమతులు అందజేశారు. ఈకార్యక్రమంలో భారత్ ఆదివాసీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొట్టడం రాజుబాబు, వైస్సార్‌సీపీ పంచాయతీ విభాగం రాష్త్ర ప్రధాన కార్యదర్శి బొబ్బిలి లక్ష్మణ్, దేవరాపల్లి మాజీ ఉప సర్పంచ్ కుమారి, స్థానిక నాయకులు శ్రీనివాస్, బాబూరావు, ఉపాధ్యాయులు దేవరాజు, రామరాజు, రమేష్, రవి, రామలింగం పాల్గొన్నారు.


