జి.మాడుగుల: మండలంలోని గాంధీనగరంలో పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం వెనుక కొండపై నూతనంగా నిర్మించిన ఆది పురుష శివలింగేశ్వర స్వామి ఆలయంలో భీమిలి సద్గురు సేవాశ్రమం ప్రతినిధి సాయిరాం స్వామీజీ ఆధ్వర్యంలో ఆదివారం శివలింగ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు నుర్మని మత్స్యకొండంనాయుడు దంపతులు, ఎస్‌ఎస్‌ఎఫ్ జిల్లా నాయకుడు మత్స్యరాస మత్స్యరాజు దంపతులు, భక్తులు హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతికి కార్యక్రమాలు, అన్నసమారాధన నిర్వహించారు. పలు గ్రామాల నుంచి అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు పాల్గొన్నారు.
ఘనంగా శివలింగ ప్రతిష్టాపన


