గిరి గ్రామాల అభివృద్ధికి కృషి
అరకు ఎంపీ డాక్టర్ తనూజరాణి
సాక్షి,పాడేరు: మౌలిక సదుపాయాలు కల్పించి, గిరిజన గ్రామాల అభివృద్ధికి కృషిచేస్తున్నట్టు అరకు పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ గుమ్మా తనూజరాణి తెలిపారు. తన స్వగ్రామమైన హుకుంపేట మండలం అడ్డుమండలో ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన సోలార్ వీధిలైట్లు, డ్రైనేజీలు,ప్రహరీని ఆమె బుధవారం ప్రారంభించారు. అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఎంపీ కోటా నిధులను గ్రామాల అభివృద్ధికి ఖర్చుపెడుతున్నట్టు చెప్పారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుమ్మా శ్యామ్ సుందర్, ఎంపీటీసీ శెట్టి మహేశ్వరరావు,జీసీసీ మాజీ చైర్మన్ శెట్టి లక్ష్మణుడు, వైఎస్సార్‌సీపీ నేతలు చెట్టి వినయ్,కింజేడి అప్పారావు,వార్డు సభ్యులు ఉమాదేవి, భైరవమూర్తి పాల్గొన్నారు.


