నెల రోజుల భోగి మంట
సాక్షి,పాడేరు: నెలరోజుల పాటు వెలిగే భోగిమంటను జిల్లా కేంద్రం పాడేరు మెయిన్‌రోడ్డులో ఈఏడాది కూడా భక్తిశ్రద్ధలతో బుధవారం తెల్లవారుజామున వేశారు. జిల్లాలో అతిపెద్ద భోగిమంటగా ఇది గుర్తింపు పొందింది. మెయిన్‌రోడ్డుతో పాటు పలు వీధులకు చెందిన వర్తకులు,ఉద్యోగులు చందాలు వేసుకుని భారీ దుంగలను వాహనాల్లో తీసుకువచ్చి భోగిమంటలో వేశారు.ఈ భారీ భోగిమంటను వీక్షించేందుకు ఉదయాన్నే ప్రజలు మెయిన్‌రోడ్డుకు చేరుకోవడంతో సందడిగా మారింది.చాలా రోజుల పాటు ఈదుంగలు కాలతాయి. దీంతో ఇది నెలరోజుల భోగిమంటగా పేరొందింది.


