20 నుంచి ఏపీఈఆర్సీప్రజాభిప్రాయ సేకరణ
పాడేరు రూరల్: విద్యు త్ చార్జీలపై ఈనెల 20 నుంచి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నట్టు జిల్లా విద్యుత్‌శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ జి.ఎన్. ప్రసాద్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఏపీఈఆర్సీ ఆధ్వర్యంలో 20 నుంచి 27వ తేదీ వరకు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నట్టు చెప్పారు. పాడేరులోని జిల్లా కార్యాలయంలో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ప్రత్యక్ష విధానంలో, 2గంటల నుంచి సాయంత్రం 4.30 వర కు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.


