సంబరాల సింహగిరి | - | Sakshi
Sakshi News home page

సంబరాల సింహగిరి

Jan 15 2026 9:53 AM | Updated on Jan 15 2026 9:53 AM

సంబరా

సంబరాల సింహగిరి

సింహాచలం: సింహగిరిపై బుధవారం సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. సంక్రాంతి పండగ విశిష్టతను చాటుతూ, గ్రామీణ జీవన విధానాన్ని ప్రతిబింబించే విధంగా దేవస్థానం అధికారులు ఈ సంబరాలను నిర్వహించారు. భోగి పర్వదినాన స్వామివారిని దర్శించుకునేందుకు సింహగిరికి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు సంక్రాంతి సంబరాలను కూడా తనివితీరా తిలకించారు. ఉదయం ఆలయ రాజగోపురం ఎదురుగా ఉన్న మాడ వీధిలో పెద్ద ఎత్తున వేసిన భోగిమంటను దేవస్థానం ఇన్‌చార్జి ఈవో ఎన్‌.సుజాత వెలిగించి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. అనంతరం భక్తులు పిడకలను భోగిమంటలో వేశారు. దేవస్థానం స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్‌, ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ఏఈవో తిరుమలేశ్వరరావు, 98వ వార్డు కార్పొరేటర్‌ పి.వి.నరసింహం తదితరులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న ప్రదర్శనలు

సంక్రాంతి సంబరాల్లో భాగంగా మాడ వీధుల్లో ఏర్పాటుచేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. గొబ్బెళ్ల ముత్యాల ముగ్గులు, చెరుకు గెడల జాలువలు, ఎడ్లబండి, నాగళ్లు, పూరిగుడెసెలు, గడ్డిమోపులు, రంగులు వేసిన కుండలు, గోవులు, ఎద్దులబండి, ట్రాక్టర్‌ను భక్తులు తిలకించారు. జంగం దేవెర, కొమ్మదాసరి, హరిదాసులు సంక్రాతి సంబరాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గంగిరెడ్ల విన్యాసాలు, కోలాటం ప్రదర్శనలను భక్తులను ఆకట్టుకున్నాయి. ధాన్యం గుట్టలవద్ద మహిళలు సందడి చేశారు. కుండల్లో పాలు పోసి పొంగించారు. కుమ్మరి తయారుచేసే మట్టి వస్తువులను ఆసక్తిగా తిలకించారు. బొమ్మలకొలువు ఆకట్టుకుంది.

సంబరాల సింహగిరి1
1/2

సంబరాల సింహగిరి

సంబరాల సింహగిరి2
2/2

సంబరాల సింహగిరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement