రూ.9.84 లక్షలఅపరాధ రుసుం వసూలు
రాజవొమ్మంగి : మండలంలోసూరంపాలెం అటవీ ప్రాంతం నుంచి గ్రావెల్ తరలిస్తుండగా పట్టుబడిన వాహనాల యజమానుల నుంచి రూ.9.84 లక్షల అపరాధ రుసుం వసూలు చేసినట్టు రేంజ్ ఆఫీసర్ ఉషారాణి తెలిపారు. మొత్తం సొమ్ము చెల్లించడంతో సీజ్ చేసిన రెండు టిప్పర్లు, ఒక పొక్లెయిన్‌ను శనివారం యజమానులకు తిరిగి అప్పగించినట్టు చెప్పారు. నెలరోజుల కిందట తూర్పుగోదావరి జిల్లా కొయ్యూరుకు చెందిన కొంత మంది అటవీ ప్రాంతం నుంచి గ్రావెల్ తరలిస్తుండగా అటవీ అధికారులు పట్టుకుని వాహనాలను సీజ్ చేసిన సంగతి తెలిసిందే. కేసు నమోదు చేయగా వాహనాల యజమానులు అపరాధ రుసుం చెల్లించారు. కాగా అటవీ ప్రాంతం నుంచి గ్రావెల్, ఇసుక, మట్టి తరలిస్తే ఉపేక్షించేదిలేదని రేంజ్ ఆఫీసర్ ఉషారాణి హెచ్చరించారు.


