కేజీహెచ్‌ అభివృద్ధికి ఎన్టీపీసీ రూ.2 కోట్ల విరాళం | - | Sakshi
Sakshi News home page

కేజీహెచ్‌ అభివృద్ధికి ఎన్టీపీసీ రూ.2 కోట్ల విరాళం

Mar 28 2025 1:31 AM | Updated on Mar 28 2025 1:27 AM

మహారాణిపేట: విశాఖలోని కింగ్‌ జార్జ్‌ ఆస్పత్రి(కేజీహెచ్‌)లో మౌలిక సదుపాయాల కల్పనకు సింహాద్రి ఎన్టీపీసీ సామాజిక బాధ్యతలో భాగంగా రూ.2 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధుల వినియోగంపై సంస్థ అధికారులు, విశాఖ జిల్లా కలెక్టర్‌ మధ్య గురువారం ఎంవోయూ కుదిరింది. నెఫ్రాలజీ విభాగంలో ఆరు డయాలసిస్‌ యూనిట్లు, భావనగర్‌ వార్డులో నాలుగు యూనిట్లు, ఆపరేషన్‌ థియేటర్లో ఆధునిక పరికరాల కొనుగోలు, ఇతర సదుపాయాల కల్పనకు ఈ నిధుల్ని వెచ్చించనున్నట్లు కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.శివానంద్‌ తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టరు, సంస్థ అధికారులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. కార్యక్రమంలో ఎన్టీపీసీ ఏజీఎం(హెచ్‌ఆర్‌) బి.బి.పాత్ర, సీఎస్సార్‌ మేనేజర్‌ కె.ప్రకాశరావు, సీపీవో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement