
వెంకన్న ఆలయంలో ఘనంగా లక్ష తులసీ పూజ
రోలుగుంట: స్థానిక కొండపై గల శ్రీ వేంకటేశ్వర ఆలయంలో ఆదివారం లక్ష తులసీ పూజ ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకుడు రేజేటి శ్రీనివాసాచార్యులు ముందుగా స్వామివారికి పంచామృతాభిషేకం చేశారు. అనంతరం నిర్వహించిన లక్ష తులసీ పూజలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధిక సంఖ్య లో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు గ్రామానికి చెందిన మద్దాల కాశీవిశ్వనాథం దంపతులు అన్నవరం దేవస్థానం ప్రసాదాన్ని అందజేశారు. కె.నాయుడుపాలెం, మరివలస, కొవ్వూరు తదితర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో వచ్చిన భక్తులకు అవసరమైన ఏర్పాట్లను ఆలయ నిర్వాహక కమిటీ సభ్యులు సమకూర్చారు.