అయ్యో కరీమా!  నీకెన్ని కష్టాలమ్మా..

Suffering For 20 Years My Child Needs A Treatment Worth 50 Lakhs Urgently - Sakshi

గత ఇరవై ఏళ్లలో నా కూతురు బాధను చూడని రోజు లేదు. పుట్టినప్పటి నుంచి ఏదో ఒక విచిత్రమైన సమస్యతో బాధపడుతోంది నా కూతురు కరీమా తబ్రేజ్‌ సుయివాలా. 2001లో జన్మించింది. ఆమెకు  రెండేళ్లు వయస్సున్నప్పుడు భయంకరమైన చర్మవ్యాధి లక్షణాలు కన్పించాయి. ఆ వెంటనే వినికిడి సామర్థ్యాన్ని కోల్పోయింది. వినికిడి అండ్‌ స్పీచ్‌ థెరపీలు నాలుగేళ్లపాటు సాగాయి. ఆ సమయంలో ఆర్థిక పరిస్ధితి బాగలేకపోవడంతో ఏం చేయలేకపోయాం. దాంతో ఆమె వినికిడి సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోయింది.

అప్పటికే సమస్యలతో ఉన్న కరీమాకు 2012లో మరోసారి కరీమాకు సైనస్‌ సమస్య వచ్చి పడింది. వైద్యులు దాని కోసం సినోనాసల్ పాలిపోసిస్ శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. అప్పటికీ నయం కాకపోవడంతో రెండు సంవత్సరాల తర్వాత ఫంగల్ సైనసిటిస్ కోసం ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ రెండు సార్లు చేయించుకుంది కరీమా. సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి.

కరీమా ఆరోగ్యం బాగు పడేందుకు ఇప్పటికే ఇంట్లోని బంగారు ఆభరణాలను పూర్తిగా అమ్మేశౠం. ఇప్పుడు కొత్తగా కరీమాకు హైపర్ IgE సిండ్రోమ్ (HIES) ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. నా కూతురు చాలా అరుదైన ఇమ్యునో డిఫిషియెన్సీ వ్యాధి బాధపడుతోంది. ఈ వ్యాధి కారణంగా కరీమా ఊపిరితిత్తులు పూర్గిగా దెబ్బ తిన్నాయి. ఇప్పటికే ఒక దాంట్లో 3వ వంతు ఊపిరితిత్తిని తొలగించారు. ఇప్పుడు భయంకర వ్యాధి మరో ఊపిరితిత్తికి సంక్రమిస్తోంది. 

ఈ వ్యాధి నుంచి బయటపడలాంటే రెండు సంవత్సరాల పాటు మా అమ్మాయికి ఇంట్రావీనస్ ఇమ్యునోగ్లోబులిన్ థెరపీ (IVIG) చేయాలని వైద్యులు సిఫార్సు చేశారు. దీంతో పాటుగా బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌ను కూడా చేయించాలని సూచించారు. కరీమా చికిత్స నిమిత్తం ఒక్కో ఇంజెక్షన్‌కు రూ. 25,000 ఖర్చవుతుంది. ఇలాంటివి ప్రతి నెలా 8 అవసరం. ఈ చికిత్స కోసం సుమారు 50 లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు వెల్లడించారు.  ఎలాగైనా నా కూతురిని ఈ వ్యాధి నుంచి కాపాడేందుకు  మేము శాయశక్తుల ప్రయత్నాలు చేస్తున్నాం. రాబోయే రోజులు కరీమాకు అత్యంత కీలకమైనవి డాక్లర్లు వెల్లడించారు.

కరీమా కోసం ఇల్లు, ఆభరణాలు అన్ని అమ్మేసి, వీలైన దగ్గర అప్పులను కూడా చేశాం. మేము ఇప్పటి వరకు మా కుమార్తె చికిత్స కోసం రూ. 10 లక్షలకు పైగా ఖర్చు చేశాం. నా భర్త, తబ్రేజ్ ఒక సేల్స్‌మెన్‌గా పనిచేస్తాడు. అతని జీతం మొత్తం పూర్తిగా ఇంటి ఖర్చులకే అవుతోంది. మాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, వారిద్దరూ కరీమా కంటే చిన్నవారు. ఎలాగైనా మా కూతురిని కాపాడేందుకు మీ వంతు సహయం చేయగలరు. (అడ్వటోరియల్‌)

Read latest Advt News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top