మీరే దిక్కు.. ప్లీజ్‌.. కాపాడరూ...!

As a Single Parent I Cannot Afford To Save My Child Failing Heart - Sakshi

‘‘ఇప్పుడే మనలోకంలోకి అడుగుపెట్టిన చిన్నారి లేత గుండెలో సమస‍్యలు ఉన్నాయంటే ఆ ఆవేదనకు అంతుండదు. వంశాంకురంలో తలెత్తిన ఆ గుండె జబ్బు తీరని శోకాన్ని తెచ్చిపెడుతుంది. ఇప్పుడు నేను అదే బాధను అనుభవిస్తున్నా. మా కలల పంటగా పుట్టిన నా పసి బిడ్డ లేత గుండెకు 6 నెలల వయస్సులో అనారోగ్యానికి గురైందని తెలిసి  నా గుండెపగిలిపోయింది.   సింగిల్‌ పేరెంట్‌గా  నా బిడ్డను కాపాడుకునేందుకు అప్పోసప్పో చేసి ట్రీట్మెంట్‌ ఇప్పించా. కానీ ఇప్పుడు పరిస్థితి నా చేయి దాటిపోయింది. 16 ఏళ్ల వయస్సున్న నా కుతురు బాధపడని రోజు లేదు.. ఆమె బాగుండాలని ప్రార్థించిన నామొర ఆ భగవంతుడు  వినలేదు. నా పాప  జీవితం మీ చేతుల్లో ఉంది రక్షించరూ...’’అంటూ వేడుకుంటోంది ఓ మాతృమూర్తి.

అందరిలాగే కలల పంటగా పుట్టిన తెరిమెల్ల భవానీ మన లోకంలోకి పసిబిడ్డ అడుగుపెట్టిన 6 నెలల వయస్సులో గుండెలో స్టెనోసిస్‌ అనే సమస్య తలెత్తింది. శరీరంలోని మెదడు, మూత్రపిండాలు సహా కీలక అవయవాలకు రక్త సరఫరాను ప్రభావితం చేసే బృహద్ధమనిలో గొట్టం ఉంటుంది. ఆ గొట్టం ద్వారా గుండె నుంచి రక్తం శరీరంలోని వివిధ అవయవాల్లోకి వెళ్లాలి. తిరిగి వెనక్కి రాకూడదు. ఎప్పుడైతే రక్తం సరఫరా అయ్యే ఆ గొట్టం సన్నబడుతుందో గుండె పనితీరు మందగిస్తుంది. భవానీ ఇదే బాధను అనుభవిస్తోంది. 6 నెలలున్న వయస్సు నుంచి 16 ఏళ్ల వయస్సు వచ్చే వరకు గుండెలో సమస్యతో పోరాడుతోంది.

👉 మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి

భవానీ జబ్బును నయం చేసేందుకు అహోరాత్రులు శ్రమించి చికిత్స చేయించింది తల్లి. ఉన్న ఇల్లు వాకిలి అన్నీ అమ్ముకొని వైద్యానికి ఖర్చు పెట్టింది. కానీ ఇపుడు  పరిస్థితి  రోజు రోజుకు క్షీణిస్తూ చేయి దాటిపోతోంది. చేతిలో చిల్లిగవ్వలేదు. కుమార్తె ఆరోగ్యం కుదుట పడాలంటే గుండెకు ఆపరేషన్‌ చేయాలి..అందుకు అక్షరాలరూ.5 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తేల్చారు.  ఇక  వేరే మార్గం లేక   తన బిడ్డను కాపాడమని దాతలను అర్థిస్తోంది.


10వ తరగతి పూర్తి చేయబోతుండగా అధ్వాన్నంగా మారిపోతున్న కూతురి భవాని పరిస్థితి చూసి తల్లిమనసు తల్లడిల్లి పోతోంది.  ఎలాగైనా తన  బిడ్డ చదువు పూర్తి చేసి జీవితంలో విజయం సాధించాలని  ఆశిస్తోంది.  అందుకే తమ కుమార్తును రక్షించుకునేందుకు  శతవిధాలా పోరాడుతోంది. దయచేసి  తమ కుమార్తె వైద్య కోసం చేయాలని దాతలను వేడుకుంటోంది.  (అడ్వర్టోరియల్‌)

👉 మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు :

Read latest Advt News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top