అయ్యో! రామూ.. నీ జీవితం ఎందుకిలా మారిపోయింది?

Please help me to save my bedridden husband ramaswamy - Sakshi

నిర్జీవంగా పడి ఉన్న  భర్త రామస్వామి మంచం పక్కనే వేయి కళ్లతో ఎదురు చూ​స్తోంది రాధమ్మ.  ప్రతీక్షణం అతని పలకరింపు కోసం పడిగాపులు కాస్తోంది. కానీ అది జరగాలంటే అతనికి ఖరీదైన వైద్యం చాలా అవసరం. అందుకే దాతలు అదుకుని తన భర్త రామస్వామికి మంచి జీవితాన్ని ప్రసాదించమని కోరుతోందామె. దాతలు మంచి మనసుతో విరాళాలిచ్చి ఆరోగ్యవంతంగా తన భర్త  రామూని తిరిగి ఇవ్వాలని కన్నీళ్లతో వేడుకుంటోంది.

భార్యభర్తలుగా తమ కుటుంబం కోసం ఎన్నో కలలు కంటుంది ఏ జంట అయినా.. రాత్రి పగలు కష్టపడి తమను నమ్ముకున్న వారికి మంచి జీవితాన్ని ఇవ్వాలని ఆశిస్తారు. అలాంటి దంపతులే రాధమ్మ రామస్వామి. కానీ అనుకోని ప్రమాదం  ఈ దంపతుల  జీవితంలో నిప్పులు పోసింది.  పనినుంచి క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడనుకున్న భర్త ప్రమాదానికి గురై అచేతనంగా పడి ఉండడాన్ని చూసి కుమిలిపోతోంది రాధమ్మ. 

 

అసలేం జరిగిందంటే.. ఎలక్ట్రీషియన్‌గా పనిచేసే రామస్వామి ఒకరోజు పనినుంచి ఇంటికి వస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ.. తీవ్ర గాయాలతో అతను అప్పటికే కోమాలోకి వెళ్లిపోయాడు. పలు పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు రామస్వామి పరిస్థితి విషమంగా ఉందని, అత్యవసరంగా పోస్ట్ ట్రామాటిక్ కేర్ బ్రెయిన్ సర్జరీ అవసరమవుతుందని చెప్పారు.  అతడిని కాపాడేందుకు అదొక్కటే మార్గం అని కూడా  వైద్యులు రాధమ్మకు  తేల్చి చెప్పారు. ఈ చికిత్సకు దాదాపు 10  లక్షలు ($ 12853.88)  అవుతుందన్నారు.

 

దీంతో ఆమె దుఃఖంతో కుప్పకూలిపోయింది. నిరుపేద కుటుంబానికి ఆ ఖర్చును భరించడం చాలా కష్టం. అయినా అందిన చోటల్లా అప్పు తెచ్చి చికిత్స అందించారు. కానీ రామస్వామి పూర్తిగా కోలుకోవాలంటే ఆపరేషన్లు, కీలకమైన మందులు అవసరం. అందుకే నిస్సహాయస్థితిలో ఉన్న తనను ఆర్థికంగా ఆదుకోవాలని రాధమ్మ ఆకాంక్షిస్తోంది. తన భర్త రామస్వామికి కొత్త జీవితాన్ని ప్రసాదించేలా సాయం చేయమని కోరుతోంది. దాతల దాతృత్వమే తనకు రక్ష అని కన్నీటితో ప్రార్థిస్తోంది రాధమ్మ. మీ విరాళాలతో ఆమె కుటుంబాన్ని ఆదుకొని, రామస్వామికి మెరుగైన జీవితాన్ని ప్రసాదించండి! (అడ్వర్టోరియల్‌)

👉 మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి

Read latest Advt News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top