చేతులు జోడించి వేడుకుంటున్నా...

My Newborns Heart Is Failing and I am Powerless To Save Her Please Help - Sakshi

మాకు పెళ్లైన ఎనిమిదేళ్లకు నేనే తల్లినయ్యారు. పుట్టబోయే బిడ్డను ఎలా చూసుకోవాలి, ఆ బిడ్డ బంగారు భవిష్యత్తు కోసం ఎలా కష్టపడాలి అనుకుంటూ నేను, నాభర్త రోజుల తరబడి గడిపాం. చివరకు నేను తల్లినయ్యాను. బిడ్డను పొదివి పట్టుకున్నప్పుడు నేను పొందిన ఆనందం మాటల్లో వర్ణించలేనిది. ఆ బిడ్డ కోసమే మా భవిష్యత్తు అనుకున్నాం.

కానీ మా కలలు కల్లలయ్యాయి. పుట్టిన కొద్ది రోజులకే పాపకు కాన్‌జెనిటల్‌ హార్ట్‌ డిసీజ్‌ ఉందని తేలింది. దీంతో పాప ఆరోగ్యం బాగయ్యేందుకు అనేక ఆ‍స్పత్రుల చుట్టూ తిరిగాం. ఇంట్లో ఉండటం కంటే ఆస్పత్రుల్లోనే ఎ‍క్కువగా గడిపాం. తల్లి పొత్తిళ్లలో ఆడుకోవాల్సిన బిడ్డ ఆస్పత్రి బెడ్‌పైనే ఎక్కువగా ఉంది. చివరకు ఓపెన్‌ హార్ట్‌ సర​‍్జరీ చేస్తే పాపకి ఆరోగ్యం నయం అవుతుందని చెప్పారు. దాని కోసం రూ. 3.80 లక్షల వరకు ఖర్చు వస్తుందని డాక్టర​‍్లు చెప్పారు.

నా భర్త రవీంద్ర రోజువారి కూలీగా పని చేస్తున్నాడు. తాను రోజంతా కష​‍్టపడితే మాకు మూడు పూటల తిండికే సరిపోతుంది. పాప ఆరోగ్యం కోసం మందులు కొనడం సైతం ఎంతో కష్టంగా ఉంటోంది. గడిచిన ఐదు నెలలుగా ఆస్పత్రుల చుట్టూ తిరగడాకే మా దగ్గర డబ్బులు సరిపోలేదు. అప్పులు చేశాం. ఇక మాకు డబ్బులు ఇవ​‍్వడానికి తెలిసిన వాళ్లెవరు మిగల్లేదు.


సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి

నా వేలు పట్టుకుని పాప ఏడుస్తుంటే గుండె తరుక్కుపోతుంది. పసిపాపకి ఎంత నొప్పిగా ఉందో.. నా వైపు చూస్తూ ఏడుస్తుంటే .. ఏమీ చేయలని మా నిస్సహాయ స్థితి తలచుకుంటే మాకే నరకంగా ఉంది. దయచేసి నా బిడ్డకు ఓ జీవితం ఇచ్చేందుకు మీ వంతు సహకారం అందివ్వండి. ఆపరేషన్‌కు అవసరమైన ఆర్థిక సాయం చేయండి. మీకు చేతులు జోడించి వేడుకుంటున్నాను. (అడ్వెర్‌టోరియల్‌)


సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి
 

Read latest Advt News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top