నా బిడ్డ బతకడానికి ఒక అవకాశం ఇవ్వండి !

Fighting Kidney Cancer Sayan Is In Pain and He Needs Your Support - Sakshi

అమ్మా.. నొప్పిగా ఉందమ్మా.. ఇంజెక‌్షన్లు వేయోద్దని చెప్పమ్మా.. అంటూ నా కొడుకు బాధతో అడుగుతుంటే నా గుండెలు తరుక్కు పోతున్నాయి. వాడి బాధ చూడలేక పోతున్నాను. ఎందుకమ్మా ఇన్ని ఇంజెక‌్షన్లు ఇస్తున్నారు? ఎప్పుడు ఇంటికి వెళ్దామని ప్రశ్నిస్తుంటే.. దగ్గర సమాధానం లేదు.

మూడేళ్లుగా నేను, నా భర్త ఇద్దరం, సయాన్‌ చుట్టే మా ప్రపంచం నిర్మించుకున్నాం.    వాడు పుట్టినప్పటి నుంచి వాడు చేసే ప్రతీ అల్లరి పని మాకు ఎంతో ముచ్చటగొలిపేది. ఒక రోజు వాడికి స్నానం చేపిస్తుంటే కిడ్నీల దగ్గర ఏదో తేడాగా అనిపించింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాం. రకరకాల పరీక్షలు చేసిన డాక్టర్లు సయాన్‌కి అరుదైన కిడ్నీ సంబంధిత క్యాన్సర్‌ వ్యాధి (విల్మ్స్‌ ట్యూమర్‌) ఉందని తేల్చారు. 

డాక్టర్లు చెప్పిన మాట వినగానే మేమిద్దరం కుప్పకూలిపోయాం. చిన్నారి సయాన్‌కి అంత భయంకరమైన వ్యాధి ఎందుకు వచ్చిందా అని తల్లడిల్లిపోయాం. మమ్మల్ని ఓదార్చిన డాక‍్టర్లు సయాన్‌ వ్యాధి నయం చేసే అవకాశం ఉందన్నారు. కొన్ని సర్జరీలు చేసి మందులు వాడితే తిరిగి ఆరోగ్యవంతుడు అవుతారని భరోసా ఇచ్చారు. అయితే వాటి కోసం రూ. 7 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు.
సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి

నా భర్త కాయకష్టం చేసుకుని బతికే మనిషి. ఒక్కసారి అంత డబ్బు ఎలా సర్దుబాటు చేసే అవకాశం మాకు లేదు. మరోవైపు కళ్లముందే కొడుకు రోజురోజుకి మృత్యువుకి దగ్గరవుతున్నాడు. వాడికేమైనా జరగరానిది జరిగితే జీవితాంతం నన్ను నేను క్షమించుకోలేను. ఈ క్షణంలో చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటున్నాను. నా బిడ్డ బతికేందుకు మీ వంతు సాయం అందించండి. వాడికి కొత్త జీవితాన్ని ప్రసాదించండి. (అడ్వెర్‌టోరియల్‌)


సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి 

Read latest Advt News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top