మూడేళ్ల చిన్నారికి క్యాన్సర్‌.. సహాయం చేయగలరా? (స్పాన్సర్డ్‌)

3 Years Old Cancer Is Already Claiming Her Life Please Help Save Her - Sakshi

ఇనియా బోసినవ్వులతో వెలిగిపోతున్న ఆ ఇంట ఒక్కసారిగా విషాదం అలుముకుంది. 3ఏళ్ల చిన్నారి హాస్పిటల్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. విపరీతమైన కీళ్ల నొప్పులతో బాధపడుతున్న ఆ చిన్నారిని చూసి తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. ఓరోజు వైద్యులను సంప్రదించగా..రక్తపరీక్షల అనంతరం ఇనియా ఆరోగ్యం చాలా సంక్షిష్టంగా ఉందని, ఆమె అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియాతో బాధపడుతుందని వైద్యులు నిర్థారించారు. ఆర్థికంగా స్థోమత లేని ఆ దంపతులు నిస్సహుయులుగా ఆదుకునే ఆపన్న హస్తం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.  కెటో (ఇండియాస్‌ మోస్ట్‌  క్రౌండ్‌ ఫండింగ్‌ సైట్‌ )చికిత్స కోసం డబ్బులు లేని ఎంతో మందికి సాయం అందిస్తోంది. ఆ చిన్నారి సమస్య గురించి ఆ తల్లి  ఏం చెబుతుందో ఒక్కసారి తెలుసుకుందాం. 

'ఇనియా మొదట్లో చాలా హుషారుగా ఉండేది. కొన్నాళ్లకు తను చాలా నీరసంగా, బలహీనంగా మారిపోయింది. ఏమీ తినేది కాదు. ఒకవేళ బలవంతంగా పెట్టినా వెంటనే వాంతి చేసుకునేది. ఎప్పుడూ ఏడుస్తూ ఉండేది. మొదట్లో అందరి పిల్లల్లాన్నే మారాం చేస్తుందని భావించాం. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ తన ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో వెంటనే వైద్యులను సంప్రదించగా రక్త క్యాన్సర్‌కు సంబంధించిన వ్యాధితో చిన్నారి బాధపడుతుందని చెప్పారు. ఇనియా వెంటనే చికిత్స చేయాలని,అందుకు 14 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. అంత డబ్బును మేం ఎంత ప్రయత్నించిన తీసుకురాలేము. మాకు కన్నీళ్లు ఆగడం లేదు.

ఇనియా పరిస్థితి ప్రస్తుతం చాలా దారుణంగా ఉంది. తీవ్ర జ‍్వరం, భరించలేని నొప్పితో ఇనియా బాధపడుటం చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. ఇప్పటికే తనకి జుట్టు బాగా రాలుతోంది. వెంటనే చికిత్స చేయాలని డాక్టర్లు చెప్పారు. నా భర్త కుమార్‌ ఓ చిన్న దుకాణంలో పనిచేసేవాడు. ఇనియా ఆరోగ్యం దృష్ట్యా ఉద్యోగాన్ని వదిలేసి ఆమెను చూసుకోవడానికి ఇంట్లోనే ఉండాల్సి వచ్చేది. ఇప్పటికే చిన్నారి హాస్పిటల్‌ ఖర్చుల కోసం  మేం దాచుకున్న డబ్బు మొత్తం అయిపోయింది. డబ్బుల కోసం మేం అన్ని విధాల ప్రయత్నించాము. కానీ ఎక్కడ మాకు డబ్బు దొరకలేదు.  మా పేదరికం కారణంగా ఇనియాకు  ఏమైనా జరిగితే మమల్ని మేం ఎప్పటికీ క్షమించుకోలేము. మీరు దయతో ఇచ్చే మొత్తం మా చిన్నారిని కాపాడగలవు. దయచేసి మా ఇనియాని కాపాడండి'.

కెటో ఇండియాస్‌ మోస్ట్‌ క్రౌండ్‌ ఫండింగ్‌ సైట్‌ ద్వారా డబ్బులు లేని చిన్నారులెందరికో చికిత్స అందజేస్తున్నారు. మీరు చేయాల్సిందల్లా మీ చేతనైనంతా సాయం కెటో ద్వారా విరాళంగా అందించండి. (అడ్వర్టోరియల్)
 

Read latest Advt News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top