సద్దుల సంబురం | - | Sakshi
Sakshi News home page

సద్దుల సంబురం

Oct 19 2026 4:07 AM | Updated on Oct 19 2026 4:07 AM

● అప్రమత్తమైన ప్రభుత్వం ● పలు అభివృద్ధి పనులకు శ్రీకారం ● తరచూ సమీక్షిస్తున్న కలెక్టర్‌ ● నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు

రిమ్స్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటన తర్వాత ఎస్‌ఎన్‌సీయూ వార్డును క్రిటికల్‌కేర్‌ లోనికి మార్చారు.

చిల్డ్రన్‌ వార్డులో సైతం అనేక ఇబ్బందులు ఉండగా, ఆ వార్డును కూడా క్రిటికల్‌కేర్‌ లోనికి మార్చారు.

రిమ్స్‌లోని పలు అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం రూ.11.10కోట్లు కేటాయించింది.

ఆస్పత్రి ఆవరణలో సీసీ రోడ్లు, మరుగుదొడ్ల మరమ్మతులు, ఏసీ రిపేర్లు, ఆస్పత్రి గోడలకు పెయింట్‌ వేయిస్తున్నారు. ఇదివరకు పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంటుండగా, ఈ ఘటన తర్వాత రోజుకు మూడుసార్లు కార్మికులు ఆస్పత్రిని శుభ్రం చేస్తున్నారు.

ముగ్గురు ఆర్‌ఎంవోలను నియమించి పర్యవేక్షణను పెంచారు.

సెక్యూరిటీగార్డులకు వాకీటాకిలు అందజేశారు. రాత్రి వేళల్లో రోగుల బంధువులకు బ్రీత్‌ అనలైజర్‌ ద్వారా డ్రంక్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

బతుకమ్మతో వస్తున్న

మహిళ

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ సద్దుల వేడుకలు జిల్లాకేంద్రంలో ఆదివారం సంబురంగా సాగాయి. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను కూడళ్ల మధ్య ఉంచి ఉయ్యాల పాటలకు అనుగుణంగా చప్పట్లు కొడుతూ లయబద్ధంగా కదులుతూ మహిళలు, యువతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో డీఆర్డీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలను కలెక్టర్‌ రాజర్షి షా ప్రారంభించారు. అలాగే పట్టణంలోని బ్రాహ్మణవాడతో పాటు పలుచోట్ల నిర్వహించిన వేడుకలు అంబరాన్నంటాయి. – ఆదిలాబాద్‌

ఆదిలాబాద్‌టౌన్‌: ఉమ్మడి జిల్లాకు పెద్దదిక్కుగా ఉన్న రిమ్స్‌పై ప్రభుత్వం ఫోకస్‌ పెంచింది. ఈ ఆ సుపత్రిలో గతనెలలో జరిగిన అగ్నిప్రమాద ఘటన తర్వాత మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కలెక్టర్‌ రాజర్షిషా ప్రత్యేక దృష్టి సారించారు. తరచూ తనిఖీలు చేయడం, వైద్యాధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ ఆస్పత్రిని గాడిన పెట్టేందుకు చర్యలు చేపడుతున్నారు. ఘటన తర్వాత అనేక మార్పులు జరిగాయి. పారిశుధ్య, పేషెంట్‌కేర్‌, సెక్యూరిటీ గార్డులు వివిధ పనుల్లో ఉండగా, వారికి కేటాయించిన డ్యూటీల్లోనే కొనసాగుతున్నారు. ఆస్పత్రి అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇటీవల రూ.11.10 కోట్లు కేటాయించింది. దీంతో పలు పనులు చేపడుతున్నారు. అలాగే ఆవరణలో ఉన్న షాపుల తొలగింపు చర్యలు చేపట్టారు. ప్రత్యేకంగా శానిటేషన్‌పై దృష్టి సారించారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు. గుట్కా, తంబాకు, ఇతర వస్తువులను లోనికి తీసుకెళ్లకుండా సెక్యూరిటీగార్డులు తనిఖీలు చేపడుతున్నారు. పేషెంట్‌తో వచ్చే రోగుల బంధువులకు పాస్‌లు అందజేస్తున్నారు. దీంతో బంధువుల రద్దీ తగ్గింది.

కలెక్టర్‌ ప్రత్యేక దృష్టి..

ఇటీవల రిమ్స్‌ అగ్నిప్రమాద ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో ప్రభుత్వం ఈ ఆసుపత్రిపై దృష్టి సారించింది. ఈ ఘటన తర్వాత కలెక్టర్‌ రాజర్షిషా కనీసం వారానికి ఒకసారైనా తనిఖీలు నిర్వహిస్తున్నారు. వైద్యులు, సిబ్బందితో సమీక్షిస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించేవారిపై కొరడా ఝళిపిస్తున్నారు. ఎవరికి కేటాయించిన పనులను వారే చేయాలని, సమయపాలన పాటించాలని, ఆస్పత్రిని పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశిస్తున్నారు. కలెక్టర్‌ తరచూ ఆస్పత్రిని తనిఖీ చేయడంతో గతం కంటే ప్రస్తుతం మార్పులు కనిపిస్తున్నాయి. వైద్యులు సైతం అందుబాటులో ఉంటూ రోగులకు వైద్యసేవలు అందిస్తున్నారు.

ఘటన తర్వాత చోటుచేసుకున్న మార్పులు..

చేప చెరువుకు చేరేనా..?

అవగాహన కల్పిస్తున్నాం

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల స్లాబ్‌పై పరిమి తి విధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అందాయి. లబ్ధిదారులు అదనపు స్లాబ్‌ పెంచుకుని అప్పుల పాలు కావద్దనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఏఈల ద్వారా లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నాం. నిబంధనల మేరకు స్లాబ్‌ నిర్మించుకోవాలి. లేనిపక్షంలో బిల్లలు నిలిచిపోయే అవకాశముంది.– షాకీర్‌, హౌసింగ్‌ డీఈ

ఇందిరమ్మ ఇళ్ల వివరాలు

మంజూరైనవి 17,276

పూర్తయినవి 4,247

ఇంకా ప్రారంభం కానివి 2,087

పునాదులకే పరిమితమైనవి 1,338

బేస్‌మెంట్‌ స్థాయిలోనివి 3,029

స్లాబ్‌ దశలో ఉన్నవి 2,887

స్లాబ్‌ పూర్తయినవి 3,688

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement