● మాజీ మంత్రి జోగు రామన్న
ఆదిలాబాద్‌టౌన్: యువతకు ఉద్యోగాలు కల్పి స్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హామీలు ఇచ్చి మోసం చేస్తున్నాయని మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఆదివారం రవీంద్రనగర్‌కు చెందిన ఆకర్ష్, శివతేజతో పా టు సుమారు వంద మంది పార్టీలో చేరగా, వా రికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్ని కల సమయంలో బీజేపీ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు, కాంగ్రెస్ ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీలిచ్చి యువతను మభ్యపెట్టాయని ఆరోపించారు. సీసీఐ పరిశ్రమ పునరుద్ధరణ కోసం ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడంలో ఎమ్మెల్యే శంకర్ విఫ లమయ్యారని విమర్శించారు. కార్యక్రమంలో మున్సిపల్ మా జీ చైర్మన్ ప్రేమేందర్, అలాల్ అజయ్, ఫ్లోర్ లీడర్ ప్రకాశ్, వెంకటేశ్, పండ్ల శ్రీనివాస్, ప్రహ్లాద్, రాజన్న, సాజిత్ ఉద్దీన్, రమేశ్, వసంత్, దమ్మపాల్, గణేష్, దయానంద్, సృజన్, రాజు, సురేందర్, సంతోష్, ప్రశాంత్, కలీం తదితరులు పాల్గొన్నారు.


