ఆరో రోజుకు ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల దీక్ష | - | Sakshi
Sakshi News home page

ఆరో రోజుకు ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల దీక్ష

Oct 19 2026 4:01 AM | Updated on Oct 19 2026 4:01 AM

ఆదిలాబాద్‌టౌన్‌: ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించేంత వరకు దీక్ష కొనసాగిస్తామని ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు స్పష్టం చేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయ ఆవరణలో చేపట్టిన రిలే దీక్ష ఆరో రోజుకు చేరింది. ఉద్యోగులు ఆదివారం మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. వీరికి ఏఐటీయూసీ నాయకులు ఎస్‌.విలాస్‌, దేవేందర్‌ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏళ్ల తరబడి ఎన్‌హెచ్‌ఎంలుగా సేవలందిస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, అర్హతలు, వర్తించే నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేశారు. ఇందులో జేఏసీ అధ్యక్షుడు దొంతుల ప్రవీణ్‌, ఉపాధ్యక్షులు డాక్టర్‌ ఈశ్వర్‌, డాక్టర్‌ సుజాత, కోశాధికారి డి.గితేష్‌, ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ గోపాల్‌, డాక్టర్‌ జక్కుల నరేందర్‌, డాక్టర్‌ సంతోష్‌, శ్రీకాంత్‌, సోనీ, సురేందర్‌, శ్రీనివాస్‌, నాగార్జున్‌, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement