ముగిసిన సౌత్‌జోన్‌ నెట్‌బాల్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన సౌత్‌జోన్‌ నెట్‌బాల్‌ పోటీలు

Oct 19 2026 4:01 AM | Updated on Oct 19 2026 4:01 AM

నిర్మల్‌టౌన్‌: జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ మినీ స్టేడియంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న సౌత్‌ జోన్‌ (దక్షిణ భారతదేశ) నెట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌–2026 మహిళ, పురుషుల సీనియర్స్‌ పోటీలు ఆదివారం ముగిశాయి. అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు భోజన్న నేతృత్వంలో నిర్వహించిన పోటీల్లో దక్షిణ భారతదేశంలోని 6 రాష్ట్రాల నుంచి 12 జట్లు పాల్గొన్నాయి. మూడు విభాగాలుగా పోటీలు నిర్వహించారు. 2వ సౌత్‌ జోన్‌ మిక్స్‌డ్‌ ఫైనల్స్‌లో పుదుచ్చేరి–తెలంగాణ జట్లు పోటీ పడగా తెలంగాణ జట్టు విజయం సాధించింది. 18వ నేషనల్‌ పురుషుల చాంపియన్‌షిప్‌లో పుదుచ్చేరి–కేరళ జట్లు ఫైనల్లో పోటీ పడగా కేరళ జట్టు విజయం సాధించింది. మహిళల విభాగంలో కర్ణాటక–కేరళ జట్లు తలపడగా కేరళ జట్టు విజయం సాధించింది. ఫాస్ట్‌–05 మహిళల విభాగంలో తెలంగాణ–కేరళ జట్లు పోటీపడగా కేరళ జట్టు విజయం సాధించింది. పురుషుల విభాగంలో పుదుచ్చేరి జట్టుపై తెలంగాణ జట్టు విజయం సాధించింది. విజేతలకు మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌, డాక్టర్‌ అవినాష్‌ , డాక్టర్‌ రమణ, కప్పులను అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement