తలమడుగు: జిల్లాలో పశుసంపద వృద్ధిపై రైతులు ప్రత్యేక దృష్టిసారించాలని ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ దూద్‌రామ్ రాథోడ్ పేర్కొన్నారు. మండలంలోని భరంపూర్, ఝరి గోపాలమిత్ర కేంద్రాలను సోమవారం సందర్శించారు. పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల, పశువులకు అందిస్తున్న కృత్రిమ గర్భధారణ గురించి వి వరాలను గోపాలమిత్రలను అడిగి తెలుసుకున్నా రు. రైతులు ప్రతీ ఆవులు, గేదెల చెవులకు గుర్తింపు ట్యాగ్‌లు వేయించాలన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 111 గోపాలమిత్ర సేవ కేంద్రాలు ఉన్నాయని వీ టిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. భరంపూర్ సర్పంచ్ దేవన్న, గ్రామపెద్దలు కేదారేశ్వరరెడ్డి, కార్యదర్శి అనిల్‌రెడ్డి, తలమడుగు సర్పంచ్ చంటి, లక్ష్మీనారాయణ, సాయి, పవన్, గోపాలమిత్ర జంగు స్వామిరెడ్డి గంగన్న తదితరులు ఉన్నారు.


