మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఒకే నంబర్ ప్లేట్‌తో రెండు బైక్‌లు ఉన్నాయి. మంచిర్యాల మున్సి పల్ కార్పొరేషన్ పరిధిలోని నంనూర్‌కు చెందిన లారీ డ్రైవర్ కారుకూరి వినోద్ బైక్‌కు ఆదివారం చలాన్ పడినట్లు ఫోన్‌కు మెస్సేజ్ చూసి ఖంగుతిన్నాడు. ఓపెన్ చేసి ఫొటో క్లిక్ చేస్తే తన వాహన నంబర్ ప్లేట్ మరో బైక్‌కు ఉండడంతో అవాక్కయ్యాడు. వినోద్ వెంటనే 100కు డయల్ చేసి ఫిర్యాదు చేశాడు. కాగా, భీమారం పోలీస్‌స్టేషన్ పరిధిలో తన నంబర్ ప్లేట్‌తో తిరుగుతున్న వాహనదారుడికి లైసెన్స్ లేని కారణంగా చలాన్ విధించినట్లు వినోద్ తెలిపారు.
ఒకటే నంబర్ ప్లేటు ఉన్న బైక్‌లు


