బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు | - | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

Sep 1 2026 12:31 AM | Updated on Sep 1 2026 12:31 AM

తలమడుగు: పాముకాటుకు గురై రిమ్స్‌లో చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నందిగామ గ్రామానికి చెందిన కనక సందీప్‌ (25) తనకున్న నాలుగెకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడు. ఆదివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా పాము కాటేసింది. వెంటనే మేల్కోని పామును పట్టి చంపివేశాడు. గ్రామంలో నాటు వైద్యం తీసుకున్నాడు. అయినా నొప్పి తగ్గకపోవడంతో కుటుంబీకులు అతన్ని జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. మృతుడికి సోదరుడు అక్షయ్‌, తల్లి ఉన్నారు. కౌటాల(బెజ్జూర్‌): బెజ్జూర్‌ మండలం కుకుడ గ్రా మానికి చెందిన పి.బాపు(70) సోమవారం పాముకాటుకు గురై మృతి చెందాడు. మధ్యాహ్నం తన ఇంటి పెరట్లో నుంచి ఎద్దులకు మేత వేయడానికి గడ్డిని తీస్తుండగా పాము కాటేసింది. కుటుంబ సభ్యులు వెంటనే బాపును కాగజ్‌నగర్‌కు తరలించారు. ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందాడు.

రెబ్బెన: ఆర్టీసీ బస్సు బైక్‌ ఢీకొన్న ఘటనలో యువకుడు మృతిచెందినట్లు ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. కెరమెరి మండలం గోయగాం పంచాయతీ ఇందాపూర్‌కు చెందిన వాడై మునేశ్వర్‌ (28) కాగజ్‌నగర్‌లో పనిచేస్తుంటాడు. రోజు వెళ్లి వస్తుంటాడు. సోమవారం రాత్రి పనులు ముగించుకుని బైక్‌పై ఇంటికి బయల్దేరాడు. రెబ్బెన మండలం రాంపూర్‌, నవేగాం బస్టాప్‌ల మధ్య చేరుకున్నాడు. ఎదురుగా బెజ్జూర్‌కు వెళ్తున్న ఆదిలాబాద్‌ డిపో ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొట్టింది. ఎగిరిపడిన మునేశ్వర్‌ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎస్సై సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసిఫాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పోక్సో కేసు.. యువకుడి అరెస్టు

కౌటాల(బెజ్జూర్‌): బెజ్జూర్‌ మండలంలోని ఓ గ్రా మానికి చెందిన మైనర్‌ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన అదే గ్రామానికి చెందిన యువకుడు రౌతు మహేశ్‌పై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై సర్తాజ్‌ పాషా సోమవారం తెలిపారు. బాలిక ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రేమ పేరిట పలుమార్లు లైంగికదాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు మహేశ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

చికిత్సపొందుతూ మృతి

పాముకాటుతో వృద్ధుడు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement