అర్జీలు సత్వరం పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

అర్జీలు సత్వరం పరిష్కరించాలి

Sep 1 2026 12:31 AM | Updated on Sep 1 2026 12:31 AM

ఉట్నూర్‌రూరల్‌: అర్జీలు సత్వరం పరిష్కరించాలని ఐటీడీఏ పీవో మంద మకరందు పేర్కొన్నారు. ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో మండలాల ప్రజల నుంచి అర్జీలను ఆయన స్వీకరించారు. ల్యాప్‌ టాప్‌ మంజూరు చేయాలని ఉట్నూర్‌ మండలం భూరుమాజీగూడకు చెందిన కుర్సెంగ మహేశ్‌, తనకు బ్లడ్‌కాన్సర్‌ చికిత్సకు ఆర్థికసా యం అందించాలని గుడిహత్నూర్‌ మండలం తోషం వాసి మెస్రం శ్రీను, ఇతరులు అర్జీలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జీలను శాఖల అధికారులు పరిశీలించి పరిష్కరించాలన్నారు. ఐటీడీఏ శాఖల అధి కారులు పాల్గొన్నారు.

నంబర్‌ ప్లేట్‌ లేని వాహనాలు నడిపితే కేసులు

మంచిర్యాలక్రైం: జిల్లాకేంద్రంలో నంబర్‌ ప్లేట్‌ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని ట్రాఫిక్‌ సీఐ హన్నన్‌ పేర్కొన్నారు. రామగుండం సీపీ అంబర్‌ కిషోర్‌ఝా ఆదేశాలతో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నామని తెలిపారు. స్థానిక ప్రధాన చౌరస్తాల వద్ద సోమవారం తనిఖీ నిర్వహించారు. నంబర్‌ ప్లేట్‌ లేని 12 బైక్‌లను గుర్తించి సీజ్‌ చేశారు. మరో 40 వాహనాలకు జరిమానా విధించారు. సీఐతోపాటు సిబ్బంది ఉన్నారు.

మందుబాబులకు జరిమానా

మంచిర్యాలక్రైం: డ్రంకెన్‌ డ్రైవ్‌లో ఇటీవల పట్టుబడిన 24 మందికి న్యాయమూర్తి రమేశ్‌ సోమవారం జరిమానా విధించారు. మందుబాబుల కు మొత్తం రూ.40,500 జరిమానా విధించిన ట్లు ట్రాఫిక్‌ సీఐ హన్నన్‌ తెలిపారు.

ఒకరి రిమాండ్‌

మంచిర్యాలక్రైం: పోలీస్‌ విధులకు ఆటంకం కల్గించిన ఒకరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌ కు తరలించినట్లు సీఐ ప్రమోద్‌రావు తెలి పా రు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌ ఏరియాలో ఎస్సై మజా రొద్దీన్‌ ఆదివారం రాత్రి వాహనాల తనిఖీ చేపట్టారు. ముగ్గురు స్కూటీపై వెళ్తుండగా ఆపి తనిఖీ చేసేందుకు ప్రయత్నించగా మద్యం మత్తులో నలిగేటి వివేక్‌.. కానిస్టేబుల్‌పై దుర్బాషలాడి వీరంగం సృష్టించాడు. వివేక్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.

ఇద్దరికి ఏడాది జైలు

తానూరు: విద్యుత్‌ తీగలు చోరీకి పాల్పడిన ఇద్దరికి ఏడాది జైలుశిక్షతోపాటు రూ.2 వేల చొప్పున జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి శ్రీవాణి సోమవారం తీర్పునిచ్చింది. ఎస్సై షేక్‌ జుబేర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. 2023లో ముధోల్‌కు చెందిన అభిబ్‌ హైమద్‌, సయ్యద్‌ జీషన్‌లు భైంసా నుంచి ఎల్వి సబ్‌స్టేషన్‌కు సరఫరా చేసే 33 కేవీ విద్యుత్‌ తీగలు చోరీ చేశారు. ఏఈ ప్రదీప్‌ ఫిర్యాదుతో అప్పటి ఎస్సై విక్రమ్‌ కేసు దర్యాప్తు చేపట్టారు. కోర్టులో చార్జిషీట్‌ దాఖలు అనంతరం వారిని విచారించగా నేరం రుజు వైంది. ఈమేరకు జిల్లా జడ్జి తీర్పుచెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement