‘ముఖ్యమంత్రి వ్యాఖ్యలు నిరంకుశత్వానికి నిదర్శనం’
ఆదిలాబాద్‌టౌన్: బీఆర్‌ఎస్ పార్టీ గద్దెలను కూల్చమంటూ పిలుపునివ్వడం సీఎం నిరంకుశత్వానికి నిదర్శనమని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న విమర్శించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ము ఖ్యమంత్రి ఏ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారో ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్‌ఎస్ ప్రజల గుండెల్లో నుంచి పుట్టుకొచ్చిన పార్టీ అని, ఆ పార్టీని చెరిపేయ డం ఎవరితరం కాదని స్పష్టం చేశారు. అలాగే కొరటా–చనాఖా ప్రాజెక్ట్‌కు జిల్లాకు చెందిన స్వాతంత్ర సమరయోధుల పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఇందులో పార్టీ పట్టణ అధ్యక్షుడు అజయ్, నాయకులు పాల్గొన్నారు.


