300 క్యూసెక్కులు విడుదల
సాత్నాల: భోరజ్ మండలం హత్తిఘాట్ వద్ద నిర్మించిన కొరటా–చనాఖా పంప్‌హౌస్ నుంచి అధికారులు సోమవారం 300 క్యూసెక్కుల నీ టిని విడుదల చేశారు. ఈనెల 16న పంప్‌హౌస్ వద్ద నీటిని విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి ఎలాంటి సాంకేతిక లోపాలు తలెత్తకుండా జా గ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించి న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మూడు రోజుల పాటు నీటి విడుదల ఉంటుందని, సమస్యలు తలెత్తితే పరిష్కరిస్తామని అధి కారులుపేర్కొంటున్నారు. రైతులు నీటిని పొ దుపుగా వాడుకోవాలని సూచిస్తున్నారు. ఇందులో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఉమామహేశ్వరరావు, ఏఈ ప్రభు, విద్యుత్ శాఖ అధికారులు నాగేశ్వరరావు, లక్ష్మణ్, ప్రశాంత్ పాల్గొన్నారు.


