వేళాయె
వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. గాలిలో తేమశాతం పెరగనుంది. వేకువజామున పొగమంచు ప్రభావం కనిపిస్తుంది.
వన్యప్రాణుల లెక్కింపునకు
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలోని అడవుల్లో వన్యప్రాణుల సర్వేకు ఆ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. దేశ వ్యాప్తంగా అటవీ జంతువుల గణన చేపడుతున్నారు. ఇందులో భాగంగా మంగళవా రం నుంచి జిల్లాలో ఈ ప్రక్రియ ప్రారంభం కా నుంది. అవసరమైన సిబ్బందితో పాటు స్వచ్ఛందంగా గణన చేసేందుకు దరఖాస్తు చేసుకున్న వ లంటీర్లు పాల్గొననున్నారు. వీరికి అటవీ అ ధికారులు శిక్షణ కల్పించారు. మాంసహార, శా ఖాహార జంతువుల గణన వేర్వేరుగా చేపట్టనున్నారు. సర్వే ఆరు రో జుల పాటు కొనసాగనుంది. వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో న మోదు చేస్తారు. జిల్లా అటవీ శాఖ అధికారితో పాటు ఎఫ్‌డీవోలు, ఎఫ్‌ఆర్‌వోలు సర్వేను పర్యవేక్షిస్తారు. జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంలో సిబ్బందికి సోమవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సర్వే తీరుతెన్నులను ఆ దిలాబాద్ ఎఫ్‌డీవో చిన్న విశ్వనాథ్ బూసిరెడ్డి, ఉ ట్నూర్ ఎఫ్‌డీవో అరవింద్, ఎఫ్‌ఆర్‌వోలు గులా బ్‌సింగ్, సంతోష్,ముఖ్తార్‌అహ్మద్ వివరించారు.
సిబ్బందితో పాటు వలంటీర్లు..
ప్రస్తుతం ఈ సర్వేలో ఎఫ్‌బీవోలు, వాచర్లతో పాటు అటవీ జంతువులపై అవగాహన కలిగిన 90 మంది వలంటీర్లు పాల్గొననున్నారు. ఈనెల 20, 21, 22 తేదీల్లో శాఖాహార జంతువుల గణన, 23, 24, 25 తేదీల్లో మాంసాహార జంతువుల గణన చేపట్టనున్నారు. 171 బీట్‌ల పరిధిలో 9 రేంజ్‌లు ఉన్నాయి. 120 మంది బీట్ ఆఫీసర్లు, వాచర్లుసర్వేలో పాల్గొననున్నారు. ట్రాన్స్ సెక్ట్ సర్వే రెండు కిలోమీటర్ల నడ క, ట్రైల్‌సర్వేనడక 5 కిలోమీటర్ల పాటు చేపడతారు.
ప్రత్యేక యాప్‌లో నమోదు..
జంతు గణనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్ రూ పొందించింది. సేకరించిన డేటాను అందులో ఎప్పటికప్పుడు ఫొటోలతో సహా అప్‌లోడ్ చేస్తారు. ‘మానిటరింగ్ సిస్టమ్ ఫర్ టైగర్స్– ఇంటెన్సివ్ ప్రొటెక్షన్ అండ్ ఎకోలాజికల్ స్టేటస్’ యాప్‌లో జియో ట్యా గింగ్ చేస్తారు. ఎదురుపడే జంతువులు, అవశేషాలు, పాదముద్రలు, మల విసర్జన పదార్థాలు, చెట్లౖ పె కాలిగోర్ల గుర్తులు, వెంట్రుకలు వంటివి అందులో అప్‌లోడ్ చేస్తా రు. ఏ అవశేషం ఏ జంతువుది, ఆహారశైలీ, ఆరో గ్య పరిస్థితి వంటి అంశాలను జాతీయ వన్యప్రాణి సంస్థ లెక్కలు వేసి జంతు గణన పూర్తయిన అనంతరం అధికారికంగా ప్రకటిస్తారు.
జిల్లాలో
అటవీ విస్తీర్ణం, శాతం : 1,82,630
హెక్టార్లు(44 శాతం)
సర్వే చేపట్టనున్న బీట్‌లు :171
పాల్గొననున్న బీట్ ఆఫీసర్లు: 120,
వలంటీర్లు: 90
నేటి నుంచి గణన..
జిల్లాలోని అడవుల్లో మంగళవారం నుంచి ఈ గణన చేపట్టనున్నారు. ఉదయం 6.30 నుంచి 8.30 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, కృష్ణ జింకలు, మనుబోతులు, నక్కలు, అడవి కుక్కలు, అడవి పందులు తదితర వన్యప్రాణులను లెక్కిస్తారు. ప్రతి నాలుగేళ్లకోసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అటవీ శాఖ ఆధ్యర్యంలో ఆలిండియా టైగర్ ఎస్టిమేషన్ (ఏఐటీఈ) పేరుతో మాంసాహార, శాఖాహార జంతువుల గణనను చేపడతారు.
వేళాయె


