‘యూనివర్సిటీపై మాట మార్చడం సరికాదు’
కై లాస్‌నగర్: యూనివర్సిటీ ఏర్పాటుపై సీఎం రేవంత్‌రెడ్డి మాట మార్చడం సరికాదని నిరుద్యోగ యువత జేఏసీ, ఏజెన్సీ డీఎస్సీ సాధన కమిటీ అధ్యక్షుడు సోమేష్ ఆరోపించారు. జి ల్లాలోని ఇంద్రవెల్లి కేంద్రంగా యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో సోమవారం ఆ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలోనే యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన సీఎం మళ్లీ బాసరలో ఏర్పాటు చేస్తామంటూ మాట మా ర్చడం సరికాదన్నారు. కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.


