వేగంగా కొత్త యూనిట్ల పనులు
పొల్లూరు జల విద్యుత్ కేంద్రంలో 5, 6 యూనిట్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. లక్ష్యానికి అనుగుణంగా పనులు పూర్తి చేసేందుకు కష్టపడుతున్నారు. ఎప్పటికప్పుడు పనుల పురోగతిపై సూచనలు, సలహాలు ఇస్తున్నాం.
– సుజయ్ కుమార్,
ఏపీ జెన్‌కో హైడల్ డైరెక్టర్
ఏడాది లోపు పూర్తి చేసేలా..
పొల్లూరు జల విద్యుత్ కేంద్రంలో చేపట్టిన కొత్త యూనిట్ల నిర్మాణ పనులు మొత్తం ఏడాది కాలంలో పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. ఇప్పటికే చాలా వరకూ పనులు తుది దశకు వచ్చాయి. పూర్తి స్థాయి పర్యవేక్షిస్తున్నాం.
– సీహెచ్ రాజారావు,
చీఫ్ ఇంజినీర్, ఏపీ జెన్‌కో సీలేరు కాంప్లెక్స్
తుది దశకు అనుసంధాన పనులు
కొత్తగా నిర్మిస్తున్న 5, 6 యూనిట్ల అనుసంధాన పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయి. ఏడాది లోపే 5, 6 యూనిట్లను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చి విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటాం.
– బి.బాలకృష్ణ,
డీఈ, ఏపీ జెన్‌కో, పొల్లూరు
●
వేగంగా కొత్త యూనిట్ల పనులు
వేగంగా కొత్త యూనిట్ల పనులు


