పాపికొండల విహార యాత్రకు..
దేవీపట్నం: అఖండ గోదావరి అందాలను వీక్షించేందుకు ఆదివారం పాపికొండల విహారయాత్రకు పర్యాటకులు పోటెత్తారు. సంక్రాంతి సెలవుల చివరిరోజు కావడంతో పలు రాష్ట్రాల నుంచి ముందుగా ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకున్న పర్యాటకులు రాజమహేంద్రవరం నుంచి పలు వాహనాల్లో అటు పురుషోత్తపట్నం, ఇటు గోకవరం మీదుగా పోశమ్మగండికి చేరుకుని పర్యాటక బోట్లపై పేరంటపల్లికి వెళ్లారు. 14 పర్యాటక బోట్లపై 1,014 మంది పర్యాటకులు లైఫ్ జాకెట్లు ధరించి పేరంటపల్లికి వెళ్లి నిర్దేశించిన సమయానికి సురక్షితంగా తిరిగి పోశమ్మగండికి చేరుకున్నారు.


