సీఎం పర్యటనకు భారీ బందోబస్తు
ఆదిలాబాద్‌టౌన్: సీఎం రేవంత్‌రెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా 500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ అఖిల్ మహాజన్ దగ్గరుండి పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు. ముగ్గురు అదనపు ఎస్పీలు, నలుగురు డీఎస్పీలు, 12 మంది సీఐలు, 32 మంది ఎస్సైలు బందోబస్తులో పాల్గొన్నారు. వీరితో పాటు స్పెషల్ బ్రాంచ్ పార్టీ రెండు ప్లాట్ల టీజీఎస్‌పీ సిబ్బంది విధులు నిర్వర్తించారు. పార్కింగ్, హెలిప్యాడ్, కాన్వాయ్, పంప్‌హౌస్, చెక్‌పోస్టు వద్ద బాంబ్ డిస్పోజల్ టీమ్, ఇన్నర్, ఔటర్ కార్డెన్, పదిరకాల సెక్టార్లతో సిబ్బందిని విభజించి బందోబస్తు విధులు కేటాయించారు. ఎస్పీ వెంట అదనపు ఎస్పీలు కాజల్‌సింగ్, సురేందర్ రావు, ఏఎస్పీ మౌనిక, శిక్షణ ఐపీఎస్ రాహుల్ కాంత్, డీఎస్పీలు జీవన్ రెడ్డి, శ్రీనివాస్, సీఐలు, ఎస్సైలు ఉన్నారు.


