బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి
ఆదిలాబాద్‌టౌన్: ల్యాబ్‌టెక్నీషియన్లు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్ అన్నారు. ఇటీవల వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు అందుకున్న ల్యాబ్ టెక్నీషియన్లు శుక్రవారం డీఎంహెచ్‌వోను కలిసి విధుల్లో చేరారు. భీంపూర్(టి), హస్నాపూర్, బజార్‌హత్నూర్, అంకోలి, తాంసి, సైద్‌పూర్, ఝరి, గిమ్మ, డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఖాళీగా ఉన్న ల్యాబ్‌టెక్నీషయన్ పోస్టులు భర్తీ అయినట్లు పేర్కొన్నారు. అంతకుముందు ల్యాబ్‌టెక్నీషియన్లు డీఎంహెచ్‌వోను శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛాలు అందజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ నిజామొద్దీన్, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, ల్యాబ్ టెక్నీషియన్లు తదితరులు పాల్గొన్నారు.


