అరెస్టులతో రైతు ఉద్యమాన్ని ఆపలేరు
ఆదిలాబాద్‌టౌన్/నేరడిగొండ: రైతుల పక్షాన బీఆర్‌ఎస్ చేపడుతున్న నిరసన, ఆందోళన కార్యక్రమాల ను అక్రమ అరెస్టులతో ఆపలేరని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న స్పష్టం చేశారు. శుక్రవా రం సీఎం ఆదిలాబాద్ పర్యటన నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లా పోలీసులు రామన్నను హౌస్ అరెస్ట్ చేశారు. తన నివాసంలోనే పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన నల్ల బ్యా డ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ, కొరటా–చనాఖా ప్రాజెక్టును ట్రయల్ రన్ పేరుతో మరోసారి ప్రారంభిస్తూ రైతులను మోసం చేయడం తగదన్నారు. హౌస్ అ రెస్టు చేసిన రామన్నను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు కలి శారు. అరెస్టును ఖండించారు. ఇందులో ప్రేమేందర్, ప్రహ్లాద్, అజయ్, దమ్మపాల్, గణేశ్, శ్రీను, రమేష్, అశోక్ స్వామి, భూమన్న తదితరులున్నారు.


