సీఎంకు వినతుల వెల్లువ | - | Sakshi
Sakshi News home page

సీఎంకు వినతుల వెల్లువ

Jan 17 2026 8:17 AM | Updated on Jan 17 2026 8:17 AM

సీఎంకు వినతుల వెల్లువ

సీఎంకు వినతుల వెల్లువ

● బోథ్‌ నియోజకవర్గంలోని కుప్టి హైడల్‌ ప్రాజెక్టు నిర్మాణానికి కృషి చేయాలని డీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ నరేశ్‌జాదవ్‌ కోరారు. అలాగే డీసీసీ కార్యాలయానికి అవసరమైన స్థలం కేటాయించాలని విన్నవించారు. ● మధుర లబానాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఆ సంఘం నాయకులు సీఎంను కలిసి వినతి పత్రం అందజేశారు. ఏజెన్సీ ప్రాంతంలో సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని కోరారు. సంత్‌ కాలుబాబా జయంతి, గురుబాబా జయంతి ఉత్సవాలకు ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

ఆదిలాబాద్‌టౌన్‌: భోరజ్‌ మండలంలోని కొరటా–చనాఖా బ్యారేజ్‌ నీటి విడుదల కోసం శుక్రవారం జిల్లాకు విచ్చేసిన సీఎం రేవంత్‌ రెడ్డికి వినతులు వె ల్లువెత్తాయి. ఆదిలాబాద్‌, బోథ్‌ ఎమ్మెల్యేలు పా యల్‌ శంకర్‌, అనిల్‌ జాదవ్‌లు ముఖ్యమంత్రిని క లిసి వినతి పత్రాలు అందజేశారు. నియోజకవర్గా ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

బోథ్‌ను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలి..

– అనిల్‌ జాదవ్‌, బోథ్‌ ఎమ్మెల్యే

బోథ్‌ను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలి. కుప్టి ప్రాజెక్ట్‌ టెండర్‌ పూర్తి చేయాలి. భీంపూర్‌ మండలంలోని పిప్పల్‌కోటి, బజార్‌హత్నూర్‌ మండలంలోని దేగామ ప్రాజెక్ట్‌ భూ నిర్వాసితులకు పరిహారం అందించాలి. ఇదివరకు మంజూరైన 28 చెరువులకు టెండర్‌ ప్రక్రియ పూర్తి చేయాలి. పిప్పిరి, తేజాపూర్‌, బుగ్గారం, సుంకిడి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ నిర్మాణ పనులను ప్రారంభించాలి. బరంపూర్‌ నుంచి మోర్ఖండి, సిరిచెల్మ నుంచి పెంబి రోడ్లకు అటవీశాఖ అనుమతి ఇవ్వాలి. బోథ్‌లో ఫైర్‌స్టేషన్‌ ఏర్పాటు చేయాలి. నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్‌ పాఠశాల నిర్మించాలి.

మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేయాలి..

– పాయల్‌ శంకర్‌, ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే

నియోజకవర్గంలో సాగునీరు, వ్యవసాయం, వి ద్య, మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేయాలి. కొరటా–చనాఖా కాలువకు సంబంధించిన పంపి ణీ కాలువ, ఫీల్డ్‌ ఛానళ్ల నిర్మాణానికి భూసేకరణ చే పట్టాలి. ప్రాజెక్టు ద్వారా రైతులకు పూర్తిస్థాయిలో సాగునీటి ప్రయోజనం కల్పించాలి. పెండల్‌వాడ ట్యాంకుతో పాటు జైనథ్‌ ట్యాంక్‌ పునరుద్ధరణ చేపట్టాలి. రబీ సీజన్‌లో పండించే జొన్న పంటకు కనీస మద్దతు ధర చెల్లించి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. విద్యారంగ అభివృద్ధిలో భా గంగా జిల్లాకు ఇంజినీరింగ్‌ కళాశాల మంజూరు చేయాలి. జైనథ్‌ మండలంలో డిగ్రీ కళాశాల ఏ ర్పాటు చేయాలి. నూతనంగా ఏర్పడిన సాత్నాల, భోరజ్‌ మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు అ వసరమైన మండల సముదాయ భవనాలు నిర్మించాలి. సాత్నాల మండలం పార్డి(కె) వద్ద వాగుపై హైలెవల్‌ బ్రిడ్జి నిర్మాణానికి ఆమోదం ఇవ్వాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement