అట్టహాసంగా యువజనోత్సవం
కైలాస్‌నగర్: జిల్లాస్థాయి యువజనోత్సవాలు మంగళవారం అట్టహాసంగా సాగాయి. జిల్లా యువజన సర్వీస్‌ల శాఖ ఆధ్వర్యంలో జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన వేడుకలను కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా హాజ రై ప్రారంభించారు. జిల్లాలోని వివిధ ప్రాంతా ల నుంచి తరలివచ్చిన కళాకారులు, యువత ఆటపాటలతో సందడి చేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన ఇన్నోవేషన్ స్టాల్స్‌ను కలెక్టర్ తిలకించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. యువత భవిష్యత్తు కోసం ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నాయని వాటిని సద్వినియోగం చేసుకుని ఉన్నతంగా ఎదుగాలన్నారు. కార్యక్రమంలో ట్రెయి నీ కలెక్టర్ సలోని, జిల్లా యువజన సర్వీసుల శాఖ అధికారి కె.రాజలింగు, డీఐఈవో జాదవ్ గణేశ్, డీవైఎస్‌వో జక్కుల శ్రీనివాస్ , ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్‌రావు తదితరులు పాల్గొన్నారు.


